పొత్తులతో లాభం ఉండదు

d k aruna
d k aruna

హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలలో పొత్తులతో లాభం ఉండదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే అరుణ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరు జిల్లాలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చూస్తే ఏదో జరిగిందన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో అరుణ తన నివాసంలో సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రక్షాళనపై హైకమాండ్‌ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. పొత్తుల వల్ల అన్ని జిల్లాలలో లాభం ఉండదని ముందుగానే చెప్పామనీ, గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం పొత్తుల వల్లనే ఓడిపోయామనీ కాదనీ, చాలా కారణాలు ఉన్నాయని అరుణ తెలిపారు.