పొంచి ఉన్న ‘మత్తు’ ముప్పు

                           పొంచి ఉన్న ‘మత్తు’ ముప్పు

DRINKING ALCHOHOL
DRINKING ALCHOHOL

మాదక ద్రవ్యాల వ్యసనం వినాశనానికి దారితీస్తున్నదని, దాన్ని సమష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఎంతో కాలంగా పాలకులు చెప్తూనే ఉన్నారు. అయితే అంత కురెట్టింపు స్థాయిలో ఏడాదికెడాది ఈమత్తుపదార్థాల వాడకం,వ్యాపారం పెరిగిపోతున్నది. ఇటీవల పోలీసులకు పట్టుపడుతున్న ఈ మాదకద్రవ్యాల వ్యాపారులను కానీ, వారివద్ద ఉన్న నిల్వలను కానీ పరిశీలిస్తే ఆందోళన కలుగుతున్నది. అటు రైల్వేస్టేషన్లలోనూ, ఇటు విమానా శ్రయాల్లోనూ పెద్దఎత్తున ఈ మాదకద్రవ్యాలు పట్టుబడు తున్నాయి. రవాణా అవ్ఞతున్న వాటిలో కేవలం పది శాతం కూడా పోలీసులకు పట్టుబడటం లేదనే వాదన లను తోసిపుచ్చలేం. అన్నింటికంటే ముఖ్యంగా పదో తరగతి చదివే విద్యార్థులను కూడా ఇందుకు బానిసలు చేసేందుకు ప్రయత్నాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగి స్తున్నది.

గతవారంలో హైదరాబాద్‌లో పట్టుబడిన ఈ మాదకద్రవ్యాల అమ్మకందారులు వెల్లడిస్తున్న విషయాలు విస్తుపోయేలా చేస్తున్నాయని పోలీసు వర్గాలే అంగీకరి స్తున్నాయి.మైనారిటీ తీరని పిల్లలపై ఈ వ్యసనం తీవ్ర ప్రభావం చూపుతున్నది. మాదకద్రవ్యాల మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిలో చేయకూడ ని, చేయరాని పనులకు పాల్పడుతూ అవి కప్పిపుచ్చు కునేందుకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వాస్తవంగా మానవజాతిని పట్టిపీడిస్తున్న వ్యసనా ల్లో మద్యం రక్షసి అయితే, మాదకద్రవ్యాలు పిశామని చెప్పొచ్చు. దేశంలో జరుగుతున్న నేరాల్లో నిందితుల్లో అధికశాతం ఈ మత్తులో ఉన్నవారే. ఈ మాదకద్రవ్యాల మత్తులో తండ్రిని హత్య చేసిన కొడుకులు, కుమార్తెలను హత్య చేసిన తండ్రులు ఇలా ఒక్కొరేంటి ఈ మత్తులో వారు చేస్తున్న అరాచకాలకు అంతేలేకుండాపోతున్నది.

అనేక దేశాలతోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణాలోనూ ఈ వ్యాపారం ప్రమాదకరంగా పరిణ మిస్తున్నది. ఈ వ్యాపారానికి మూల కేంద్రమైన మెక్సి కోలో అక్రమ రవాణా వ్యాపారం విలువ ఏటా పదివేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని అనధికార అంచనా. ఇది ఏడాదికేడాదికి పెరిగిపోతున్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల విభాగం లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మత్తుమందు వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది. భారతదేశానికి సంబంధిం చి మత్తు బానిసలు దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. గల్ఫ్‌లోని ఒమన్‌లో సాగు ఆదిలో ఎనిమిది లక్షల ఎకరాలుంటే ఇప్పుడది దాదాపు డెబ్భై, ఎనభై లక్షలకు పెరిగి ఉండవచ్చునని అంతర్జాతీయ లెక్కలే వెల్లడిస్తున్నాయి.

ఒక్క హెరాయిన్‌ వాడకం ప్రపంచవ్యాప్తంగా ఐదువందల టన్నులకుపైగా దాటిందని, మాదకద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక (వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌)వెల్లడించింది. భారత్‌లో పదేళ్ల క్రితం హెరాయిన్‌ వినియోగం కేవలం ఇరవై, ఇరవైఐదు టన్ను లుకాగా ఇప్పుడది పదిరెట్లకుపైగా పెరిగినట్లు సంబంధిత అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. దేశంలో ప్రతి ఇరవై మందిలో ఒకరు ఆల్కహల్‌, ప్రతి యాభై మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మత్తుపదార్థానికి అలవాటు పడుతున్నారని, ఇది అనేక అనర్థలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మెదడు, గుండె, జీర్ణాశయం, కాలేయం వంటి శరీరభాగాలపై ప్రభావం చూపడం లక్షల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు అవ్ఞతున్నారు. కొందరు శాశ్వతంగా మంచానికే పరిమితమై కృంగికృశించి ఆ మత్తులోనే అసువ్ఞలు బాస్తున్నారు. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది.

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఖజికిస్థాన్‌ దేశాల్లో నిషేధపు మత్తుమందులు ముప్ఫైకోట్ల మంది వాడుతున్నట్లు అంచనా. కంబోడియా, మయన్మార్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో కూడా ఈ వాడకం గణ నీయంగా పెరిగింది. ఆదేశాల నుంచి అనేక రహస్య మార్గాల్లో బంగ్లాదేశ్‌కు చేరుకొని అక్కడి నుండి సరి హద్దుదాటి భారత్‌లోకి రవాణా అవ్ఞతున్నాయి. భారత్‌ నేడు మత్తుపదార్థాలకు అతిపెద్ద మార్కెట్‌ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. మారుతున్న జీవన విధానం, సునాయాసనంగా లభించే డబ్బుతో యువత ఆవైపు మొగ్గుచూపుతున్నది. పట్టణాల్లో, నగరాల్లో పిల్లలను మాదకద్రవ్యాల మాఫియా ముఠాలు లక్ష్యంగా చేసుకొని ఒక వ్యూహం ప్రకారం ఆ ఉచ్చులోకి దింపడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. బాలల హక్కుల పరి రక్షణ కోసం ఏర్పాటు అయిన జాతీయ సంఘం ఐదేళ్ల క్రితమే వెల్లడించిన నివేదిక దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. పదిహేను నుంచి పంతొమ్మిదేళ్ల పిల్లలు అటు పొగాకుకు, ఇటు ఆల్కహాలుకో అలవాటు అయి అక్కడ నుండి ఈ మత్తుపదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారు.

పది హేనేళ్లలోపు పిల్లలే ఓపిఎం, హెరాయిన్‌ లాంటి మత్తు పదార్థాలను విరివిగా వాడుతున్నారు. అందుకే హైదరా బాద్‌ వంటి నగరంలో ఎక్కడో ఒక చోట పోలీసులు దాడుల్లో ఇవి పట్టుబడుతూనే ఉన్నాయి. ఇలా పట్టుబ డిన వారు జైలుకువెళ్లి తిరిగి వచ్చి మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నారు. ఇందులో నైజీరియన్‌లే ఎక్కువగా ఉన్నారు. కోట్లాది రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడు తున్నా, ఎంత మందిని అరెస్టు చేస్తున్నా, ఈవ్యాపారాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పలువ్ఞరు సినిమా ప్రముఖులపై కూడా ఆరోపణలు వచ్చాయి. సంబంధిత అధికారులు వారిని విచారించారు. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో? వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో? నేటికీ వెలుగుచూడలేదు. ఏదిఏమైనా మాదకద్రవ్యాల సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవలసిన తరుణమిది.
– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌