పైసావసూల్‌ ఆడియో సక్సెస్‌ మీట్‌

PAISA VASOOL
PAISA VASOOL

పైసావసూల్‌ ఆడియో సక్సెస్‌ మీట్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా భవ్యక్రియేషన్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన చిత్రం పైసావసూల్‌. ఈ సినిమా ఆడియో సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరిబాలకృష్ణ, శ్రియ, పూరిజగన్నాథ్‌, ముస్కాన్‌, కైరాదత్‌, వి.ఆనందప్రసాద్‌, అన్నేరవి, పులగం చిన్నారాయణ, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథిగా ఎ.కోదండరామిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సాధారణంగా నేను సినిమా పరిశ్రమలో పెద్దగా ఎవరినీ కలవను. కానీ మోహన్‌బాబుగారిని వారి పిల్లలైన విష్ణు, మంచు లక్ష్మి, మనోజ్‌లను మాత్రమే కలుస్తా. ఆ కుటుంబంతోనే నాకు ఎక్కువ చనువ్ఞ. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోదండరామిరెడ్డి గారితో నాది చాలా మంచి కాంబినేషన్‌. మోహన్‌బాబు, కోదండ రామిరెడ్డి పైసా వసూల్‌ ఆడియో సక్సెస్‌మీట్‌కు వచ్చినందుకు థాంక్స్‌. డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌తో ఎప్పటినుంచో చేయాలని ఉంది. కాస్త లేట్‌ అయింది. ఆర్టిస్టులకు చాలెంజ్‌ ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఇమేజ్‌ అడ్డువచ్చినప్పుడు సవాల్‌ ఎదురవ్ఞతుంది. ఈ సినిమాను 78 రోజుల్లో పూర్తిచేశాం. అలా ఒక్కో సినిమాకూ ఒక్కో రోజుకూ తగ్గించుకుంటూ వస్తున్నాం. సినిమా చాలా భారీగా ఉంది. సెట్స్‌, కార్‌ ఛేజ్‌లు భారీగా ఉన్నాయి. అందరినీ మంచి అట్మాస్‌ఫియర్‌ క్రియేట్‌ చేసేది ముందు నిర్మాత, తర్వాత దర్శకుడు. అలాంటి అద్భుతమైన మనిషి పూరి. మా ఇద్దరినీ బాగా జెల్‌ అయింది. ఆయనకు ఎప్పుడూ పని గురించే ఆలోయన ఉంటుంది. మంచి సినిమా చేయాలనే తపన ఆయనకు ఉంటుంది. ఈ సినిమాను శ్రియ చేసినందుకు కూడా థాంక్స్‌ చెప్పాలి. సినిమా అంటే సమిష్టి కృషిగా చూస్తా. షాట్‌ అయ్యాక నేనెప్పుడూ కెమెరామెన్‌నే చూస్తా. డైరెక్టర్‌ ఐడియాను స్క్రీన్‌ మీద చూపించేది కెమెరామెన్‌.

సినిమాను సెప్టెంబరు 29న అనుకున్న వాళ్లం ఐదు వారాల ముందు విడుదల చేస్తున్నాం. ఇండస్ట్రీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాను. బాలకృష్ణ సినిమాను ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో ఈ సినిమా అలాగే ఉంటుది. తప్పకుడా అందరినీ మెప్పిస్తుంది అన్నారు. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాతకి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. బాలయ్యబాగు గురించి ఏం చెప్పాలి? భారతదేశమే కాదు…ప్రపంచమే గర్వించదగిన మహానటుడు మా అన్నయ్య. నాకూ, అన్నయ్యకున్న సంబంధం పూర్వజన్మసుకృతం. నా తల్లిదండ్రులిన, గురువ్ఞను ఎలా గుర్తుపెట్టుకుంటానో, మా అన్నయ్యను కూడా ప్రతిరోజూ అనుకుంటూ ఉంటా. మా అన్నగారి కుమారుడి పట్ల చాలా ఆనందంగా ఉంది. మద్రాసు ప్రోగ్రామ్‌ని కౌన్సిల్‌ చేసుకుని ఇక్కడికి వచ్చా. ఇది నా ఇంట్లో వేడుక కాబట్టి వచ్చాను. రకరకాలుగా టీజ్‌ చేస్తుంటారు. అది మంచిద కాదు. బాలయ్య ఇవాళ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన తన సినిమాలను డబ్బిచ్చి ఆడించలేదు. తను కొత్తగా రికార్డు చెప్పక్కర్లేదు. ఆయన సిల్వర్‌ జుబ్లీలు, గోల్డెన్‌ బుబ్లీలు ఆడాయి. మంచినటుడి కుమారుడు గొప్పనటుడిగా ప్రూవ్డ్‌ హిమ్‌సెల్ప్‌. ఏదో ఒకటి చేయకండి. బాలయ వండర్‌పుల్‌ యాక్టర్‌. ప్రతి పిక్చర్‌లోనూ ఒక వెరైటీ, ఒక డైలాగ్‌ ఉంటుంది. అన్నయ్యని ఇమిటేట్‌ చేశానంటే నేను ఒప్పకోను అన్నారు. పూరిజగనాథ్‌ మాట్లాడుతూ ఆనందప్రసాద్‌గారితో వర్క్‌ చేయడం చాలా బావ్ఞంది. ప్రొడక్షన్‌తో పాటు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. మావా ఏక్‌ పెగ్‌లా రాకింగ్‌. పిల్లలు కూడా పాడేస్తున్నారు. బాలయ్యతో ఇన్నాళ్లు చేయక మిస్‌ అయ్యా. ఇప్పుడు షూటింగ్‌ పూర్తయ్యాక రోజూ మిస్‌ అవ్ఞతూన్న. ఇలాంటి హీరోని నేను ఇప్పటిదాకా చూడలేదు.సెప్టెంబరు 29న విడుదల చేయాలనుకుంటే ఐదు వారాల ముందు తనకు కావాలని నిర్మతగారు అడిగారు. 5 వారాల ముందు రావడానికి చార్మి చాలా ప్లాన్‌ చేసింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు.