పేలుడు సామాగ్రి స్వాధీనం

పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో భారీగా పేలుడు పదర్థాలు పట్టుబడ్డాయి. రామగుండం కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారది సారథ్యంలో దాడులు నిర్వహించారు. దర్మారం మండలం గొంగతుర్తి గ్రామ సమీపంలో నిషేదిత బ్లాస్టింగ్ మెటిరియల్ ఉందన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. 600 జిలెటిన్‌స్టిక్స్, 500 ఐడీఎల్ పవర్స్, మూడు కంప్రెషర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిరేకల్‌కు చెందిన అల్లకుంట్ల కరుణాకర్, ఆలకుంట్ల మల్లేశ్, యాదాద్రి జిల్లా మోతుకూర్కు చెందిన ఓర్పు వెంకన్నలను అదుపులోకి తీసుకున్నారు.