పేరుకుపోయిన వినియోగదార్ల కేసులు

Consumer Forum
Consumer Forum

పేరుకుపోయిన వినియోగదార్ల కేసులు

దేశం మొత్తం మీద వినియోగదారుల కోర్టుల్లో 4.5 లక్ష లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కు వ శాతం జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవే. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేసులు పేరు కుపోయాయి. జిల్లాస్థాయి ఫోరమ్‌లలో సరైనసిబ్బంది లేకపోవ డమే దీనికి కారణం. ఆగస్టు రెండవ తేదీ వరకు తాజా పరిస్థితిని పరిశీలిస్తే జిల్లా వినియోగదారుల కోర్టుల్లో 20 శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.500 జిల్లాకోర్టు ఫోరమ్‌లలో మొత్తం 1884 ఉద్యోగాలు మంజూరుకాగా, 383 ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయి. ప్రతి జిల్లా వినియోగదారుల ఫోరానికి ప్రెసి డెంట్‌, సభ్యులు ఉంటారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల సంఖ్య గతకొన్నాళ్లుగా పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాల కమిషన్లు, జిల్లా ఫోరాలు కేసులుత్వరగా పరిష్కారం కావడానికి లోక్‌ అదాల త్‌ల సహకారం తీసుకొంటున్నాయి.కేంద్రప్రభుత్వం ఈసమస్యను దృష్టిలోపెట్టుకుని జిల్లా ఫోరాల్లో అధ్యక్షుడు, సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి తగినచర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిం చింది. అలా భర్తీఅయితే ఏ వినియోగదారుల ఫోరమ్‌ కూడా పని చేయకుండా ఖాళీగా ఉండవని సూచించింది. ఒకవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో పెరుగుతుండగా మరోవైపు ఈ కోర్టుల పటి ష్టతకు ప్రభుత్వం మంజూరుచేసే నిధులశాతం రానురాను తగ్గిపో తోంది.2015-16లోరూ.2331.08లక్షలవరకు నిధులు మంజూ రు కాగా2016-17లో 965.75లక్షలకు తగ్గడం గమనార్హం.

వినియోగదారుల ఫిర్యాదుల దస్త్రాలు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హ ర్యానా వంటిరాష్ట్రాల్లో రాజకీయవర్గాల పెత్తనం,ముఠాల సంస్కృ తి వినియోగదారుల వేదికలను నీరుకారుస్తున్నాయి. అందుకనే కేంద్రం వినియోగదార్ల వేదికలకు న్యాయస్థానాల స్థాయిలో అధి కారాలను కట్టబెట్టడానికి నడుంకట్టింది. జిల్లా,రాష్ట్ర స్థాయి ఫోరా లన్నిటికీ పటిష్టంగా హక్కులు కల్పించడానికి ప్రయ త్నిస్తోంది. సాధారణంగా వినియోగదారుల ఫిర్యాదులు అందిన తర్వాత మూడునెలల్లో వాటిని పరిష్కరించాల్సి ఉన్నా ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. జిల్లా,రాష్ట్రస్థాయి విని యోగదార్ల వేది కల్లో వందలకొలది సిబ్బంది ఖాళీలు భర్తీ కావడంలేదు.ఫలితంగా దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల కేసులు పేరుకుపోయాయి. ప్రతి ఫోరానికి తగిన సిబ్బందిని, పోలీస్‌అధికారిని నియమించి ఎప్పటికప్పుడు వారెంట్లు జారీ అయ్యేలా చూడాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విధానం సత్వరం అమలులోకి వస్తే వినియో గదారులకు జరుగుతున్న మోసా లు చాలా వరకు తగ్గు తాయి. దోషులకు శిక్షపడుతుంది. వినియోగదారుల ఫోరాల ఉత్తర్వుల్లో ఏమాత్రం జాప్యం పనికి రాదని, అవసరమయితే అదనంగా కొన్ని ఫోరాలను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం యోచిస్తోంది.ఈ ఉత్తర్వుల అమలులో జాప్యం, వైఫల్యం ఏమాత్రం జరిగినా ‘కోర్టు ధిక్కరణగా భావించి శిక్ష విధించడం జరుగుతుంది. ఇవన్నీ సక్రమంగా అమలు జర గడానికి ప్రత్యేకవ్యవస్థను ఏర్పాటు చేసే యోచన ఉంది. దాదాపు అన్నిరాష్ట్రాల్లో వినియోగదార్ల ఫోరాలు, వేదికలు ఉన్నా కనీస వస తులు లేవు..ప్రస్తుతం ఇ-కామర్స్‌ వంటి అత్యంత ఆధునిక సాంకే తిక పద్ధతులు అమలులోకి వచ్చాయి. ఈ పద్ధతులను సరిగ్గా అన్వయించుకుంటే వినియోగదార్ల ఫిర్యాదుల పరిష్కారం ఏమంత కష్టం కాదు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ ద్వారా నగదు రహిత సేవలు అందుతున్నాయి.

అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాలపై తలెత్తే వివాదాల పరిష్కారానికి ఇటీవలనే బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యా లయంలో మధ్యవర్తిత్వకేంద్రం ఏర్పాటయింది.ఇటువంటి కేంద్రా లను దేశంలోని నగరాలన్నిటిలో విస్తరింపచేయాలని కేంద్ర ప్రభు త్వం సంకల్పించింది. ఈ మేరకు కొత్తగా శాసనాన్ని అమలులోకి తేడానికి బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే వస్తు నాణ్యతలో తేడా ఉండదు. సేవల్లోలోపాలు ఉండవ్ఞ. విని యోగదారులు సంతృప్తి పడేలా అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఒకవేళ ఏవైనా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే వాటిని వెన్వెంటనే పరిష్కరించి న్యాయం చేకూరుస్తారు. దగాలు, మోసాలకు పాల్పడిన వారికి కోర్టుల రీతిలో శిక్షలు విధిస్తారు.

వినియోగదారులు ఇప్పుడు ఏ సర్వీస్‌కైనా ఆన్‌లైన్‌ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని దక్షిణ తెలం గాణ విద్యుత్‌ పంపిణీసంస్థ (టిఎన్‌పిడిసిఎల్‌)లో ఇటీవల ఆన్‌లైన్‌ బిల్లింగ్‌సరిగ్గా జరగడంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అందువల్ల వినియోగదారులు చాలామంది ఎలక్ట్రికల్‌ రెవెన్యూ ఆఫీస్‌ (ఈఆర్‌ఒ),ఈ సేవా కేంద్రాలనే ఆశ్రయించవలసి వస్తోంది. ఈ సందర్భంగా వినియోగదారులు ఫిర్యాదు లుచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 40 లక్షల విద్యుత్‌ కనెక్షన్ల నుంచిప్రతినెలా విద్యుత్‌ బిల్లుల రూపంలోరూ.440 కోట్ల నుంచి రూ.445 కోట్లవరకు లభిస్తోంది. కానీ డిస్కం ఖాతా ఆన్‌ లైన్‌ ద్వారా 11శాతం మాత్రమే ఆదాయం చేరుతోంది. రంగారెడ్డి నార్త్‌ సర్కి ల్‌లో ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ రికార్డుస్థాయిలో 20.5 శాతం నమోదవ్ఞతుండగా,హైదరాబాద్‌నార్త్‌సర్కిల్‌లో17శాతం, సెంట్రల్‌ సౌత్‌లో 12 శాతం,రంగారెడ్డి ఈస్ట్‌ సర్కిల్‌లో 6 శాతం, సౌత్‌లో అత్యల్పంగా రికార్డవ్ఞతోంది. క్షేత్రస్థాయి సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన రావడంలేదని. ఆ ఫిర్యాదు ఏస్థాయిలో ఉందో తెలుసుకోడానికి కూడా వీలుపడడం లేదన్న విమర్శలొస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వినియోగ దారులకు కొత్తచట్టంన్యాయం చేకూరుస్తుందన్న ఆశకలుగుతోంది.రూ.50 వేలకుపైగా బకాయిప డిన వినియోగదారల పేర్లు,సర్వీస్‌ నెంబర్‌, తదితర వివరాలు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో బకా యిదారులు,బిల్లు చెల్లించిన వినియోగదారుల పేర్లు ఒకేజాబితాలో కన్పిస్తున్నాయని కొందరు ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు జరిగేటప్పుడే విని యోగదారులు ఫోరాలను ఆశ్రయించవలసి వస్తుంది.అటువంటి ఫోరాలకు న్యాయ పరిరక్షణ అధికారాలను కట్టబెడితే వినియోగ దారులకు రక్షణకవచంలభించినట్టే. వినియో గదారులకు కల్తీపదా ర్థాలుకానీ, వినియోగించే వస్తువ్ఞల్లో మోసాలు జరిగినప్పుడు ఏవై నా కేసులు దాఖలు చేస్తే ఆయామోసాలకు బాధ్యులైనవారిపై వెం టనే శిక్షలు విధించేలా కేసుల తీర్పు సత్వరం అందితేనే మేలు. – కె.అమర్‌ ====