పేరాటైఫాయిడ్‌ – ల‌క్ష‌ణాలు

                          పేరాటైఫాయిడ్‌ – ల‌క్ష‌ణాలు

NAADI
NAADI

క్రిమి కారణంగా వచ్చే పేరాటైఫాయిడ్‌ దీనినే సన్నిపాత జ్వరమంటారు. ఎబర్త్‌ృ బాసిటిస్‌ టైఫోసన్‌ అను క్రిమికారణంగా సంక్రమిస్తుంది. తినే ఆహార పానీయాల ద్వారా ఈ క్రిమి శరీరంలో ప్రవేశిస్తుంది. రోగి చెమట, మూత్రం, ఉమ్మిల ద్వారా వెలువడుతుంది. ఇది సాధారణంగా 21 రోజుల వరకు ఉంటుంది. దీనిలో పేరాటైఫాయిడ్‌ 11 నుండి 13 రోజుల వరకు ఉంటుంది. ప్రారంభదశలో కొద్ది రోజులు రోగికి బలహీనత, తలనొప్పి, అవయవాల నొప్పులు, ముక్కునుండి రక్తం పడడం, చెవ్ఞలు దిబ్బవేసినట్లుండడం వంటి లక్షణాలుండొచ్చు. ఈ లక్షణాలుండొచ్చు, ఈ లక్షణాలు లేకుండా కూడా ఉండవచ్చు. కొందరిలో చలి ఉండవచ్చు. కొందరిలో లేక పోవచ్చు.

జ్వరం మొదటి వారంలో తెరలు తెరలుగా హెచ్చుతుంది. ఉదయం కన్నా సాయంత్రం 1 లేక 2 డిగ్రీలు పెరుగుతుంది. ముందు రోజుకన్న సాయంత్రం 1 డిగ్రీ పెరుగుతుంది. ఈ దశలో స్ల్పీన్‌ అను ఈ అవయవం కొద్దిగా పెరిగి పరీక్షిస్తే చేతికి తగులుతుంది. కడుపు కుడివైపున సున్నితంగా ఉండే కింది భాగాన కొద్దిగా గాలి చేరి ఉంటుంది. చిన్న పేగుల్లోని ఇలియంలో వాపు, పుండు ఉండడం వల్ల ఇది సంభవించవచ్చు. దాహం ఉంటుంది. ఆకలి ఉండదు. రోగి చిరచిరలాడతాడు. కలలు రావడం, నిద్రలో మాట్లాడటం, మేల్కొని ఉండడం, సరిగా సమాధానం ఇవ్వక పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ముందు మలబద్ధకంగా ఉండి తరువాత విరోచనలవ్ఞ తాయి. నాలుక పై తెల్లగా కనిపిస్తుంది. కడుపులో గాలి ఉంటుంది. ఏడు రోజుల తర్వాత కడుపు ఛాతీలపై దద్దుర్లు పొక్కుల్లా లేచి చేతితో నొక్కితే కనిపించవ్ఞ. రోగికి నాలుక వెలుపలకు తీయడం, చాపడం కష్టమవ్ఞతుంది. చెవ్ఞల్లో హోరు ఉంటుంది. నోటి నుండి చొంగ, నాలుక ఎండిపోవడం, పిచ్చి చేష్టల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు సగం మూసుకొని నిమీలిత నేత్రాల్లా ఉంటాయి. పధ్నాలుగు రోజులు గడిచిన తరువాత కూడా రోగి బలహీనతను బట్టి తిరగబెట్టవచ్చు.

రోగి కోలుకునే స్థితిలో ఉన్నట్లయితే తగ్గుతుంది. ఇక 21 రోజులు పూర్తిగాని రోగిలో ఆరోగ్య లక్షణాలు అంటే ఆకలి పుట్టడం విరోచనం క్రమబద్ధమవడం, నాలుక రుచి తెలిసి శుభ్రత కలిగి ఉండడం కనిపిస్తాయి. కొన్ని తరుణాలలో 21 రోజుల తర్వాత కూడా ముందున్న తీవ్ర స్థితే ఉండొచ్చు. రోగి ప్రేవ్ఞల నుండి హేమరేజస్‌ జరిగి ప్రేవ్ఞలు విడిపోయి పెరిటోనైటిస్‌ వ్యాధికి గురై చనిపోయే అవకాశముంది. ఈ రోగి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. సాధారణంగా 14 రోజులు దాటిన దరిమిలా రోగి తీవ్రస్థితి దాపురించి చనిపోయే ప్రమాదముంది. గర్భవతులలో ఈ జ్వరం చాలా ప్రమాదకరం. 105 డిగ్రీల లోపు టెంపరేచర్‌, గుండె ఆరోగ్యంగా ఉండడం, నాడీ ఆరోగ్యంగా ఉండడం రోగి స్థితి ఆందోళనకరం కాదనడానికి చిహ్నాలు, విషమ స్థితిని సూచించే లక్షణాలు ప్రారంభదశలో చాలా ఎక్కువ టెంపరేచర్‌ ఉంటుంది. టెంపరేచర్‌ తగ్గదు. విరోచనాలు విస్తారంగా అవడం, ప్రతిసారి రక్త స్రావం అవడం, గుండె బలహీనంగా ఉండడం వంటి లక్షణాలుంటాయి.

జాగ్రత్తలు : గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వెచ్చని గదిలో రోగిని విశ్రాంతిగా ఉంచాలి. గదిని శుభ్రంగా ఉంచాలి. స్పాంజ్‌తో రోగి వంటిని శుభ్రపరచి దుస్తులు ప్రతి పూట మార్చాలి. రోగి మలమూత్రాలను విసర్జించిన ప్రదేశాన్ని ఫినాయిల్‌ వంటివి వాటితో శుభ్రం చేయాలి. రోగి ఒకే భంగిమలో పడుకుంటే బెడ్‌ సోర్స్‌ వచ్చే అవకాశముంది. అందువల్ల తరచు కదుపుతూ ఉండాలి. నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రపరచి రోగి గుండెను పరీక్షిస్తూ ఉండాలి. రోగికి ఒక వారం వరకు ద్రవాహారం ఇవ్వటం మంచిది. రెండు గంటలకొక మారు ఇవ్వవచ్చు. నీటి శాతం ఎక్కువగా ఉన్న పాలు ఇవ్వడం మంచిది. తదుపరి మలంలో అజీర్ణంతో కూడిన పాలు పోతున్నాయేమో గమనించాలి. మలంలో పాలు పోతుంటే ఒక గ్లాసుడు పాలలో ఒక రెండు నిమ్మరసం చుక్కలు పిండిన పాలు విరిగి పోవ్ఞను. ఆ పాలను వడగట్టి ఆ నీటిని ఇస్తే చాలా మంచిది.