పేపర్‌ లీకేజి ఘటనలో 9 మంది మైనర్ల అరెస్టు

Arrested
Arrested

రాంచీ: సిబిఎస్‌ఈ పేపర్‌ లీకేజి ఘటనలో జార్ఖండ్‌ పోలీసులు 9 మంది మైనర్లను అరెస్టు చేశారు. ఆ మైనర్లను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు. ఐపిసి చట్టం కింద ముగ్గుర్ని అరెస్టు చేశామని జువైనల్‌ చట్టం ప్రకారం మరో 9 మంది విద్యార్ధులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పేపర్‌ లీకేజి ఘటనపై సిట్‌తో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలో సిబిఎస్‌ఈ కార్యాలయం మందు విద్యార్ధుల ఆందోళన నిర్వహించారు.