పేద‌ల‌కు సాయం సీఎం నిధి

G. Jagadish reddy
G. Jagadish reddy

సూర్యాపేట: కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సను పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గురజాల కవితకు రూ.30 వేలు, కల్పగిరి నర్సయ్యకు రూ.11 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తమ పార్టీ వారికే సీఎం సహాయ నిధి చెక్కులు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి తారతామ్యాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌ గౌడ్‌, బాషా, భూక్య వెంకటేశ్వర్లు, తూడి నర్సింహ్మారావు, బెల్లంకొండ యాదగిరి తదితరులు ఉన్నారు.