పేదవాడి కష్టం, కన్నీళ్ల నుంచి ఉద్భవించిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్

KTR
KTR

 

ఖమ్మం : దేశం అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కేటీఆర్. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పేదవాడి కష్టం, కన్నీళ్ల నుంచి ఉద్భవించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని చెప్పారు. ప్రతి నిరుపేద ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఉద్ఘాటించారు. 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. పింఛన్ల కోసం రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రేషన్ బియ్యంపై సీలింగ్ ఎత్తేశామని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కాబట్టి.. ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.