పేటిఎం, ఫోన్‌పే. పోటాపోటీ!

PAYTM
PAYTM , ph pay

పేటిఎం, ఫోన్‌పే. పోటాపోటీ!

న్యూఢిల్లీ, మార్చి 11: మెరిసేదంతా బంగారం కాదంటూ ప్రత్యర్థి కంపెనీపై ప్రముఖ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పే తీవ్ర విమర్శలకు దిగింది. తానే మార్కెట్‌ లీడర్‌నంటూ పేటిఎం అన్నీ గప్పాలు కొడుతోందని తన ప్రధాన ప్రత్యర్థి, మరో డిజి టల్‌ మనీ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం పేటిఎంపై దాడి కి దిగింది. డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ లీడర్‌ గా చెప్పుకుంటున్న పేటిఎంవి అన్ని అబద్ధాలే అంటూ ఆరోపిస్తోంది ప్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే. అయితే ఈ మధ్య పేటిఎం యుపిఐ అథారిత డబ్బు చెల్లింపుల్లో తామే ముందున్నట్లు చెప్పుకుంది. దీంతో తమకు తామే నంబర్‌ వన్‌ గా పేటిఎం చెప్పుకోవడం ఫోన్‌పేకు ఆగ్రహం తెప్పించింది.

లావాదేవీలపరంగా చూస్తే పేటిఎం చెల్లింపుల మార్కెట్‌లో ముందున్నట్టు కనిపిస్తు న్నా, దాని మొత్తం లావాదేవీల సగటు విలువతో పోల్చుకుంటే లావాదేవీల విలువ రూ.40తక్కువ గా ఉందని తెలిపింది. అసలు దాని వద్ద లావా దేవీల వివరాలు సరిగ్గాలేవని విమర్శించింది. యుపిఐను అథారిత సమాచారాన్ని పేటిఎం తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించింది.

మొత్తం 21 మిలియన్‌ లావాదేవీలు పేటిఎం వినియోగ దారుల నుంచి ఫోన్‌పే కు జరాగా అందులో 40 వేల ప్రత్యేక వినియోగదారులు 500లావాదేవీ లను రూ.40వేల కంటే తక్కువగా జరిపారని తెలిపింది. మెరిసేదంటా బంగారం కాదు అంటు పేటిఎంను ఉద్దేశించి తన బ్లాగ్‌లో పేర్కొంది. కేంద్రప్రభుత్వం 2016 నవంబర్‌ 8న తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీ లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫో న్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌ చెల్లింపు యాప్‌ల ను వాడుతుండటంతో ప్రస్తుతం వీటికి డిమాండ్‌ బాగ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి పోటీ తీవ్రస్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే.