పెళ్లితో మా ఆట మరింత మెరుగు

kasyap, saina
kasyap, saina

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పిబిఎల్‌)లో మేటి ఆటగాళ్లు సందడి చేస్తున్నా.. కొత్తగా పెళ్లయిన సైనా, కశ్యప్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివాహమైన వెంటనే టోర్నీ బరిలోకి దిగిన ఈ ఇద్దరూ.. తమ పెళ్లి గురించిన విషయాలను జంటగా పంచుకునాఉ. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావడం తమ ఆటను మరింతగా మెరుగుసరుస్తుందని సైనా-కశ్యప్‌ జోడీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. గతంలో ఆట పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై బాగా తెలుసు. గతంలో ఆట పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై సలహాలను ఇచ్చిపుచ్చుకునే వాళ్లం. కానీ భార్యభర్తల బంధం మా అవగాహనను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిందని సైనా చెప్పింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నా.. అది ప్రేమగా ఎప్పుడు రూపుదిద్దుకుందో తమకే తెలియలేదని కశ్యప్‌ అన్నాడు. దాని తర్వాత వివాహం గురించి పెద్దగా ఆటోచించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నాడు. పెళ్లి తంతు అనగానే తొలుత కష్టమనిపించినా.. తర్వాత ఎంజా§్‌ు చేశానని సైనా తెలిపింది. పెళ్లి తర్వాత ఇద్దరం కలసి ఆడడానికి పిబిఎల్‌ కంటే మంచి ఈవెంట్‌ లేదని వ్యాఖ్యానించింది.