పెళ్లికి బహుమతులు తేవ‌ద్ద‌ని కోరిన జంట!

RANVEER SINGH, DIPIKA PADUKONE
RANVEER SINGH, DIPIKA PADUKONE

బాలీవుడ్‌ సెలబ్రిటీ జంట దీపికా పదుకునే, రణ్‌వీర్‌సింగ్‌ మరికొద్ది గంటల్లో పెళ్లితో ఒక్కటి అవబోతున్నారు. ఇటలీలోని విలా డెల్‌ బాల్బియానెలొలో ఉన్న లేక్‌ కోమోలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి సంగీత్‌ జరగనుంది. పెళ్లికి వచ్చే అతిథులెవరికీ మొబైల్‌ ఫోన్లను అనుమతించడం లేదు. ఇక తమ పెళ్లికి వచ్చే వాళ్లు ఖరీదైన బహుమతులు కూడా తీసుకురావద్దని ఈ జంట కోరుతున్నది.తమకు బహుమతులు ఇచ్చే బదులు ఆ మొత్తాన్ని తన ఎన్జీవో ద లివ్‌ లవ్‌ లాఫ్‌ షౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని దీపికా ఇప్పటికే అతిథులను స్పష్టం చేసినట్లు డిఎన్‌ఏ, మిడ్‌ డే పత్రికలు వెల్లడించాయి. బాలీవుడ్‌ నుంచి ఫరాఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, సంజ§్‌ు లీలా భన్సాలీ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.