పెళ్లయ్యాక కూడ సినిమాలు చేస్తుంది

NAGA CHAITU
Naga Chaitanya, Samanta

పెళ్లయ్యాక కూడ సినిమాలు చేస్తుంది

అక్కినేని హ్యాండ్సమ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ప్రేమమ్‌ విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు.. ఇక ఇదే ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్యతో ముచ్చటిస్తూ ఓ టివి ఛానళ్‌ హీరోయిన్‌ సమంతతో ఆయన ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది.. దీనికి స్పందిస్తూ సమంత, తాను చాలా కాలంగా ఫ్రెండ్స్‌అని..ఇష్టాలు, ఆలోచనలు కలిసి ప్రేమలో పడ్డామని తెలిపారు.
వచ్చే ఏడాది తమ పెళ్లి ఉంటుందని, ఇంకా డేట్‌ ఫిక్‌్‌స చేసుకోలేదని అన్నారు. ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాలు మానేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నైనేతే రెండు కుటుంబాల సపోర్ట్‌తో హీరోగా ఈ స్థాయికొచ్చా.. సమంత తన సొంత కష్టంతో ఈ స్థాయికి వచ్చింది..అలాంటి వ్యక్తి పెళ్లి కాగానే సినిమా ఆపేయమని ఎవ్వరూ అనరే అనుకుంటా.. స్వతహాగా నాకైతే పెళ్లి తర్వాత తను సినిమాలు మానేయాలన్న ఆలోచన అస్సల్లేదు. అని స్పష్టంచేశారు.