పెరుగుతున్న వైట్‌కాలర్‌ నేరాలు

white collar crimes
white collar crimes

దొరతనంబునందు దొంగతనంబునందు భాగ్యవంతునికి ఏదైనా బాధలేదు అన్నా రు పెద్దలు.ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఈ లోకోక్తి పుట్టిందో కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే వారు చెప్పిందే నిజమనిపిస్తుంది.మన రాజ్యాంగ నిర్మాతలు ఏమి దృష్టిలోపెట్టుకోకుండా కుల,మత, వర్గ,లింగ బేధాలు లేకుండా అందరికీ సమానంగా వర్తించేవిధంగా శాసనాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు. అవి నిష్పక్షపాతంగా అమ లు చేస్తారని ఆశించారు. కానీ అమలు చేయాల్సిన కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగో, లేదా దక్షిణలకు ప్రలోభపడో చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకుం టారని ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేకపోయా రు. ఫలితంగా వందలాది కరుడుకట్టిన నేరస్తులు అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైట్‌కాలర్‌ నేరస్తులు తప్పించుకోగలుతు న్నారు.పోలీసుశాఖ తీసుకుంటున్న కొన్నిచర్యల ఫలితంగా సాధారణ దొంగతనాలు కొంతమేరకు తగ్గుముఖం పడు తున్నాయి. ప్రొఫెషనల్‌ దొంగల ముఠాల ఆగడాలు కూడా చాలా వరకు తగ్గాయని కూడా చెప్పొచ్చు. కానీ మరొకపక్క మాయమాటలు చెప్పి అతి తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము చేతికి వస్తుందని ప్రజలను నమ్మించి మోసం చేసే ఆర్థికనేరగాళ్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఒకటి, రెండుకాదు వందల కోట్లు దోచుకుంటున్నారు. వీటిని నిరోధించడం పోలీసులకు సాధ్యంకావడం లేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని,రుణాలు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పథకాల కింద నిధులు తెప్పిస్తామని, ఇలా రకరకాలుగా మోసగాళ్లు విసిరే వలలోఎంతోమంది పడు తున్నారు. ఇలా మోసపోయి లక్షలాది రూపాయలు పోగొట్టుకునే వారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఆశపడ్డంత కాలం ఈ మోసా లు జరుగుతూనే ఉంటాయని, ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని పలువ్ఞరి అభిప్రాయాలను కొట్టివేయలేం. గతంలో కరక్కాయ, మునక్కాయ లాంటి వాటితో కూడా భారీఎత్తున మోసం చేశారు. ఇప్పటికీ ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు.అనేక ఔషధగుణాలున్న కరక్కాయ పొడికి మంచి డిమాండ్‌ ఉందని, దాన్ని పొడి చేసి ఇస్తే భారీగా సంపాదించవచ్చని విస్తృతంగా ప్రచారం చేశారు. రెండు తెలుగురాష్ట్రాల్లో కార్యాలయాలు ప్రారం భించారు. వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిలో కరక్కాయ ఇస్తామని, దాన్ని పొడిచేసి ఇస్తే 1300 తిరిగి ఇస్తామని ప్రజల్లో ఆశకల్పించారు. రోజుకు రెండు కిలోలు పొడిచేస్తే ఇంట్లో ఉండే పెద్దగా శ్రమపడకుండానే రోజుకు600 రూపా యలు సంపాదించవచ్చునని నమ్మించారు.మధ్య తరగతి గృహిణులతోపాటు బీదాబిక్కి కూడా ఈ వలలో పడ్డారు. వారు చెప్పినట్లుగానే మొదలు కొన్నిరోజులు ఠంచన్‌గా వారికి డబ్బుచెల్లించారు.దీంతో వందలాదిమంది సభ్యుల య్యారు. దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల వరకు వసూలు చేసుకొని అదృశ్యమైపోయారు. ఇక మునక్కాయది మరో మోసం. తమ సంస్థలో సభ్యులుగా చేరి మునక్కా యలో ఉండే ఔషధగుణాలను ప్రచారం చేయాలని, మరికొన్ని ఆరోగ్య ఉత్పత్తులనుకూడా అందచేస్తామని హర్యానాకు చెందిన ఒకవ్యక్తి ప్రజలను నమ్మించారు. 7500రూపాయలు కట్టి సభ్యులుగా చేరాలని, మరికొందరిని చేర్పించాలని చెప్పి భారీగా కోట్లాది రూపాయలు దండుకొని అదృశ్యమైపోయారు. ఇలాంటి కేసులు ఎన్నో తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక బోగస్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పెట్టి లక్షలాది మంది అమాయకుల కష్టార్జితాన్ని కోట్లల్లో కొల్లగొట్టి బోర్డులు తిప్పేస్తే జీవిత కాలంపాటు సంపాదించుకున్న డబ్బు పోగొట్టుకొని న్యాయం చేసేవారులేక బాధితుల వేదన అరణ్యరోదనగా మారి కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో గతఐదేళ్లలో ఎక్కడ చూసినా చిన్నా, పెద్ద అన్ని ఇలాంటి బోగస్‌ కంపెనీలుకలిసి పదివేల కోట్లవరకు ప్రజలను మోసం చేసినట్లు అనధికార వార్తలు చెబుతున్నాయి. ఇందులో రికవరీ మాట ఎలా ఉన్నా నిందితుల్లో పది శాతం మందిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. కొందరు ఎలాంటి భయం,జంకు లేకుండానే బాహాటంగా తిరుగుతున్నారు. 25లక్షల రూపాయల నుంచి 250కోట్ల వరకు మోసం చేసిన ఫైనాన్స్‌కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవ్ఞతుందని చెప్పొచ్చు. ఏదోరకంగా డబ్బు సంపాదించగలిగితే తమను ఎవరూ ఏమీ చేయలేరనే భావన రోజురోజుకు పెరిగిపోతున్నది. అందుకే ఒకరిని చూసి ఒకరు పోటీపడి ప్రజలను మోసం చేసి కోటీశ్వర్లు అయిపోతున్నారు. కొందరు బాధితులు పోలీసుస్టేషన్‌కువెళ్తే న్యాయం సంగతి ఎలాఉన్నా అసలు కేసునమోదు చేసుకోవడానికే కొందరు ఇష్టపడటంలేదు. మమ్మల్ని అడిగిఇచ్చావా? ఇచ్చేటప్పుడు తెలివిలేదా?లాభం వస్తే మావద్దకు వచ్చేవాడివా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి మళ్లీ బాధితుల్ని పోలీసు స్టేషన్‌కు రాకుండా చేసి పంపుతున్నారు. అంతేకాదు ఇది పూర్తిగా సివిల్‌ తగాదా అని జోక్యం చేసుకోవడానికి వీలులేదని, కోర్టుకువెళ్లి కేసులు పెట్టి చేసుకోమని సలహాలు ఇస్తున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులన్నీ నమో దు చేస్తే పోలీసులు వేరేపని చేయలేరనే వాదన కూడా తోసి పుచ్చలేం. పెరిగిన నేరాలతోపాటు పోలీసులకు బాధ్యతలు కూడా పెరిగిపోయాయనడంలో సందేహం లేదు.ఈ మోస గాళ్లు అర్థరాత్రే,లేక ఒక రోజులో మోసం చేసి పారిపోవడం లేదు.వారలు నెలలు తరబడి ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ముందుగా కొందరి నమ్మించేందుకు చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరు స్తూ ఆ తర్వాతనే మోసాలకు పాల్పడుతున్నారు.అందుకే నేరాలు జరిగిన తర్వాత కోట్లాది రూపాయలు ప్రజలు కోల్పోయిన తర్వాత కేసుల కంటే ముందుగానే ఈ బహిరంగంగా జరుగుతున్న మోసాలపై పటిష్టమైన నిఘాపెట్టి పట్టుకోగలిగితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/