పెరుగుతున్న అవినీతిని అరికట్టాలి

ప్రజావాక్కు

 

Corruption
Corruption

పెరుగుతున్న అవినీతిని అరికట్టాలి: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి విశృంఖలంగా రాజ్యమే లుతోంది. డబ్బులు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలని పరిస్థితు లు ఏర్పడ్డాయి. ప్రతీ పనికి ఇంత రేటు అని నిర్ధారించి పేద, గొప్ప అనే బేధం లేకుండా పైసా వసూలు చేసాకే పనులు చేస్తు న్నారు. ముఖ్యంగా దళారులు తమ హవా కొనసాగిస్తూ అవినీ తిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. అప్లికేషన్లు తీసుకోవడం నుండి ఆఫీసరు సంతకం వరకు అన్ని పనులు దళారుల ప్రమేయం తోనే జరుగుతున్నాయనేది నగ్నసత్యం. ఉన్నతాధికారుల నుండి అటెండర్ల వరకు అందరూ దళారుల కనుసన్నలలోనే పని చేస్తు న్నారు.
శిక్షలకు భయపడకుండా, చట్టాలంటే భయం లేకుం డా అవినీతిని విశృంఖలంగా పెంచి పోషిస్తున్న వైనం బాధాకరం. న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా వ్యవహరించి అవినీతి పరుల ఆటలు కట్టించాలి.

బాలకార్మిక వ్యవస్థకు అంతం లేదా?: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
బాల కార్మిక వ్యవస్థ నేటికీ కొనసాగుతుంది. ఎంతో మంది పిల్లలు రకరకాల కూలీ పనులు చేస్తున్నారు. అధికారుల దృష్టికి వచ్చినా స్పందన కరువైంది. ముఖ్యంగా పల్లెటూళ్లల్లో తల్లిదం డ్రులే అత్యాశకులోనై తమ పిల్లలను తరచూ కూలీ పనులకు పంపుతున్నారు. వారి హాజరుశాతం దారుణంగా పడిపోతుంది. పట్టణాలలో రకరకాల వ్యాపార సంస్థలలో బడిమానేసి ఎందరో పిల్లలు పనిచేస్తున్నారు. చివరకు దేవాలయాలలోనూ వాహనాల పూజ వద్ద పిల్లలచే పనిచేయించుకుంటున్నారు. ఒకటి నుండి పదో తరగతి వరకు తగినంత హాజరు శాతంతో పాఠశాల విద్య నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి. పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తే తల్లిదండ్రులను, పని చేయించుకునే వారినీ కఠినంగా శిక్షించాలి. యాచక వృత్తితో జీవిస్తున్న పిల్లలను ప్రభుత్వమే హాస్టళ్లలో చేర్పించి వారిని చదివించాలి.

ప్రజల సమస్యలను పట్టించుకోండి: కె.రాజేశ్వరి, నల్గొండ

ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కనబరచడం లేదు. 13జిల్లాల నుండి ప్రజలు అనేక సందర్భాల్లో ఇస్తున్న వినతుల పరిష్కారానికి యంత్రాంగం ఏమాత్రం చొరవ చూపడం లేదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి వేలాది వినతులు ఆయా విభా గాలలో పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునే నాధుడే లేడు. వినతు లు అందిన వెంటనే వాటిని సంబంధిత విభాగాలకు పంపడం, మినహా సమీక్షలు, అలసత్వంపై చర్యలు, పరిష్కారం అయిన వినతుల వివరాలను బాధితులకు తెలియపరచడం వంటి చర్య లుశూన్యం.బాధితులు కాళ్లరిగేలా ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇకపై జిల్లా యంత్రాంగం ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి లోతైన సమీక్ష జరిపి అలసత్వం ప్రదర్శించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

పట్టిపీడిస్తున్న పారిశుద్ధ్యసమస్య: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విశాఖపట్నం రూరల్‌ జిల్లాలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణంలో ఉన్న ఆర్టీసి కాంప్లెక్స్‌ను పారి శుద్ధ్యసమస్య పట్టిపీడిస్తోంది.కాంప్లెక్స్‌ ముఖద్వారంనుండి లోపల యార్డులో మురుగునీరు చెరువ్ఞను తలపించే విధంగా ఉంటోంది. డ్రైనేజీ కాల్వల్లో మురుగునీరు, చెత్తాచెదారంతో నిండి తీవ్ర దుర్గం ధం వెదజల్లుతోంది. కాంప్లెక్స్‌లో సేకరించిన చెత్తను బయటకు తరలించకుండా బస్సులు నిలిపే స్థలంలో నిల్వ చేయ డం వలన కుళ్లి కంపు కొడుతోంది. బస్టాండ్‌లో టాయి లెట్లలోకి వెళ్లడం నరక ప్రాయంగా ఉంది. ఫలహార శాలలో ఆహారపదార్థాలు తీసుకుంటే ఠక్కున అనారోగ్యానికి గురవ్ఞతున్నారు. ప్రయాణీకుల ఇబ్బందుల ను దృష్టిలోఉంచుకొని ఆర్టీసిశాఖ శుభ్రతా చర్యలు చేపట్టాలి.

అణువిద్యుత్‌తో సమస్య పరిష్కారం: కెె.శివసాయి, హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యుత్‌ ముసాయిదాలో దేశం ఎదుర్కొంటున్న విద్యుత్‌ కొరతకు అణుశక్తే పరిష్కారమని పేర్కొంది. వచ్చే పదేళ్ల నాటికి విదేశీ కంపెనీల సహకారంతో నలభైవేలకోట్ల రూపాయల వ్యయంతో మూడు అణు విద్యుత్‌ ప్లాంట్‌లను కూడా నెలకొల్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే విదేశాలలో అణువిద్యుత్‌ విషయంలో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల దృష్ట్యా అణువిద్యుత్‌ ఏమంత క్షేమ కరం కాదని మేధావ్ఞలు హెచ్చరిస్తున్నారు. అణువిద్యుత్‌ ధర మిగి తా విద్యుత్‌ కంటే మూడురెట్లు ఎక్కువగా ఉంటుంది. అణు రియా క్టర్లు విడుదల చేసే వికరణాల వలన పర్యావరణ కాలుష్యం తీవ్రత రమై పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అణు విద్యుత్‌ ఉత్పత్తిలో మిగిలే ప్రమాదకరమైన వ్యర్థాలను పారవేసేందుకు సరైన ప్రణాళికలు విదేశాలలోనే వినియోగంలో లేవు. ముసాయిదా ప్రకారం ఈ వ్యర్థాలను గ్రామీణ ప్రాంతాలలో పారబోయాలన్న నిర్ణయం వలన గ్రామాలు ఎడారులుగా మారతాయి. సునామి సందర్భంగా జపాన్‌లోని అణురియాక్టర్‌కు జరిగిన ప్రమాదం వలన లక్షలాది ప్రజలు శాశ్వత అనారోగ్యాలకు గురయ్యారు.

ప్రయోగాలతో వికాసం వెల్లివిరుస్తుంది: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

సర్కారుపాఠశాలల్లో విద్యార్థులకు వృత్తి,సాంకేతిక విద్య ఎంతో అవసరం.దీని ప్రాధాన్యం గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పలురకాల మార్పులు చేపడుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రతి పాఠశాల లోనూ వివిధరకాల విభాగాలు ఉండేవి. వృత్తి పనులు, కుట్లు, అల్లికలు, సంగీతం, నైతిక విద్య, శారీరక వ్యాయామాలు, స్కౌట్‌ తదితరాలు.ఇవి విద్యార్థుల్లో అభిరుచితో పాటు నైపుణ్యాలు వృద్ధి చేస్తాయి.అయితే అనంతరకాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా విద్యార్థులకు పరీక్షల, సిలబస్‌ ఒత్తిడి పెరిగింది.ఉపాధ్యాయులు సిలబస్‌ పూర్తిపైన దృష్టికేంద్రీకరిస్తే, విద్యార్థులు మార్కులు,గ్రేడింగ్‌లపైదృష్టి కేంద్రీకరించవలసిన పరి స్థితి ఉంది.ఈ పరిస్థితి మారాలి. పిల్లలకు వారివారి అభిరుచులకు తగ్గట్టుగా చిన్న చిన్న ప్రయోగాలు చేసే వీలుకల్పించాలి.