పెరిగిన విప్రో, కెఇసి ఇంటర్నేషనల్‌ షేర్లు

WIPRO
WIPRO

న్యూఢిల్లీ: బ్యాంకులు, మార్టిగేజ్‌, లెండింగ్‌ కంపెనీల క్లయింట్లకు సేవలందించనున్నట్లు విప్రో తెలియచేసింది. దీంతో ఎన్‌ఎస్‌ఇలో ప్రస్తుతం ఈ షేరు 1.3శాతం పెరిగి రూ.335 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టామని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగంలోని అప్రయిజర్‌ ఆర్డర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్వహించే మెర్క్యురీ నెట్‌వర్క్‌తో విప్రో చేతులు కలిపింది. దీంతో రెండు కంపెనీలూ అప్రయిజల్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ సిస్టమ్స్‌ను నిర్వహించనున్నట్లు విప్రో తెలిపింది. దీంతో ఈ షేరు పుంజుకుంటోంది. కేఇసి ఇంటర్నేషనల్‌ 2022 నాటికల్లా 100 శాతం విద్యుదీకరణకు మొగ్గుచూపుతున్న రైల్వే వ్యవస్థ కారణంగా కెఇసి లాభపడనున్నట్లు మెక్వారీ అభిప్రాయపడింది. దీని వల్ల ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 2 శాతం పెరిగి రూ.300 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదవలో రూ.303వరకూ పెరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ షేరు 50 శాతం లాభపడే అవకాశమున్నట్లు అంచనా వేసింది. రూ.443 దీని టార్గెట్‌ రేటును ప్రకటించింది.