పెరిగిన మారుతి అమ్మకాలు

CARS
CARS

పెరిగిన మారుతి అమ్మకాలు

న్యూఢిల్లీ, మే 3: ప్రస్తుత ఆర్థిక సంవత్స రం తొలి నెలలో (ఏప్రిల్‌)లో వాహన విక్రయాలు జోరందుకున్నాయి. మారుతి సుజుకి, టయోట, హోండా, నిస్సాన్‌ ఇండియా కంపెనీలు అమ్మకాల్లో రెండం కెల వృద్ధిని సాధించాయి. మారుతి రికార్డ్‌స్థాయిలో అమ్మకాలు సాధించింది. అంతేకాకుండా ఈ కంపెనీ మినీ, యుటి లిటీ ఇలా ప్రతి సెగ్మెంట్‌ రెండంకెల వృద్ధిని సాధించింది. టాటామోటార్స్‌ దేశీయ విక్రయాలు 21శాతం క్షీణించా యి. అయితే ప్రయాణికుల వాహన విక్ర యాలు 23శాతం వృద్ధిచెందాయి. హీరో వాహన ధరలు పెరిగాయి. దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ తాజాగా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.500 నుండి రూ.2,200 వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని, ఈ తాజా నిర్ణయం మే నుండి అమల్లోకి వచ్చిందని తెలిపింది. బిఎస్‌3 దెబ్బ రూ.600కోట్లు, భారత్‌ స్టేజ్‌ (బిఎస్‌)-3 వాహన విక్రయాలపై నిషేధం వల్ల టూవీలర్‌ కంపెనీలపై రూ.600కోట్ల భారం పడిందని రేటింగ్‌ కంపెనీ ఇక్రా తెలిపింది. ఏప్రిల్‌ 1 నుండి బిఎస్‌3 వాహన విక్రయాలు, రిజిస్ట్రేష న్లపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 8లక్షల బిఎస్‌3 వాహనాలు ఉండగా, వీటిల్లో 6.71లక్షలు టూవీలర్లు, వీటి విక్రయానికి మార్చి చివరి 3 రోజుల్లో కంపెనీలు భారీ డిసౌంట్లు ఇచ్చాయి.