పెరిగిన భాగ్యనగర ప్రతిష్ట

                                    పెరిగిన భాగ్యనగర ప్రతిష్ట

GES conference
GES conference

క్షిణాసియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సమావేశం విజయవంత మైంది. ఈ సమావేశంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు,అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ పాల్గొనడంతో ఈ సదస్సుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు నూట యాభై దేశాల నుండి పదిహేనువందలకు మందికిపైగా ప్రతినిధులు ఎన్నో రంగాల నిపుణులు, మరెందరో ఈ సమావేశాల్లో పాల్గొని అమూల్యమైన సలహాలు ఇచ్చారు. ఈ సదస్సుకు వచ్చిన వారిలో యాభై రెండు శాతంపైగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉండడం గమనించదగ్గ విషయం. పారిశ్రామికీకరణలో జరిగిన, జరుగుతున్న అభి వృద్ధి గూర్చి సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సి న చర్యల గూర్చి కూడా చర్చోపచర్చలు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో యాభై మూడు అంశాలపై రెండువందల మందికిపైగా పారిశ్రామికవేత్తలు, నిపుణులు తమ ప్రసంగాలు ఇచ్చారు. మహిళల సాధి కారికతకు ప్రాధాన్యత ఇస్తూ సదస్సులో ప్రసంగాలు జరి గాయి. ప్రధానమంత్రి కూడా తన ప్రసంగంలో భారత దేశంలో మహిళలకు అనాదిగా వస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ఝాన్సీలక్ష్మీబాయి, రాణి హల్యాబాయి లాంటి వారిని గుర్తు చేస్తూ నేడు వివిధరంగాల్లో దేశానికే గుర్తింపు తెచ్చిన సానియా మిర్జా, పి.వి సింధు లాంటి వారికి కూడా తనప్రసంగంలో చోటుకల్పించారు. నీతి అయోగ్‌లో కూడా మహిళా విభాగాన్ని ప్రారంభించారు. అంతకు ముం దు మాట్లాడిన ఇవాంక ట్రంప్‌ అదే ధోరణిలో తన ప్రసం గాన్ని కొనసాగించారు. యువమహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఆమె ఉపన్యాసం కొనసాగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావ్ఞ ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ తెలంగాణలో పరిశ్రమల స్థాప నకు ప్రభుత్వం ఎలాంటి చేయూతనిస్తున్నదో స్పష్టం చేశా రు. అన్నిటికంటేముఖ్యంగా 15 రోజుల్లో అన్ని అనుమతు లు ఇచ్చేవిధంగా ఏర్పాటు చేశామని, దరఖాస్తు చేసిన 15 రోజుల లోపల అనుమతులు రాకపోతే అనుమతులు ల భించినట్టే భావించవచ్చునని వేదికనుంచే వివరించారు. అందుకే అనేక యువపారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టు బడిపెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్నట్లుకూడా తన ప్రసం గంలోతెలిపారు. ఇక శిఖరాగ్రసదస్సు ముగింపు సందర్భం గా శుక్రవారం రాత్రి తెలంగాణ ఐటి మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తల సం ఖ్య పెరుగుతున్నదనే ఆశాభావంకూడా వ్యక్తం చేశారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో అధికార యంత్రాం గం ప్రధానంగా పోలీసులు ప్రత్యేకంగా కృషిచేశారని చెప్ప కతప్పదు. 3 రోజులపాటు వచ్చిన అతిధులకు, విఐపిలకు భద్రత కల్పించడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో పోలీసులు కీలకపాత్ర వహించారు. ఏదేమైనా ఈ శిఖరాగ్ర సభవాణిజ్య పారిశ్రామికరంగాల్లో మహిళలకు పెద్దపీటవేయాల్సిందేనన్న పిలుపుతో విశ్వవి పణిలో బ్రాండ్‌ హైదరాబాద్‌ను మరింత పెంచిందనే చెప్పొచ్చు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు,సమావేశాలు జరి గినతీరు ప్రత్యేకంగా ఆతిథ్యంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశా రు. గతంలో జరిగిన 7 సదస్సులకంటే హైదరాబాద్‌లో జరిగిన సదస్సు ప్రత్యేకత చేకూర్చిందనే అభిప్రాయం వెల ్లడైంది. భారత్‌అమెరికా సంబంధాలు పెరిగేఅవకాశం ఉంది.

ఏదేమైనా హైదరాబాద్‌ప్రతిష్టను ఈ సదస్సు మరింత ఇనుమడింప చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళలకోసం ప్రత్యేకంగా వి-హబ్‌ ఏర్పాటు చేస్తు న్నట్లు ప్రకటించారు. మహిళలకు ఆర్థిక సహాయం అందిం చేందుకు పదిహేను కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అంతేకాదు ఒక్కొక్క మహిళకు కోటి రూపాయల వరకు సహాయం అందించ డమేకాక ప్రభుత్వ అవసరాల కొనుగోళ్లలో ఇరవై శాతం చిన్న,మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు వాటా ఉంటుందని ఈ ఇరవై శాతంలో నాలుగో వంతు మహిళల నుంచే తీసు కోనున్నట్లు ప్రకటించారు.ఇది సదస్సు ముగిసిన వెంటనే ప్రకటించడంతో ఈ సదస్సుద్వారా తెలంగాణాలోని మహి ళలకు లభించిన అవకాశమనే చెప్పొచ్చు. ఇక ఈ సదస్సు లో చర్చించిన అనేకాంశాలు పారిశ్రామికవేత్తలకు ఎంతో చే యూతనిచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆయా దేశాల పరిస్థితులు, అవసరాలు, మార్కెటింగ్‌వివరాలు అర్థంచేసు కునే అవకాశాలు ఈ సదస్సులో లభించాయి. ఈ సదస్సు ద్వారా భారత్‌లో ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యువపారిశ్రామికవేత్తలు విదేశాలనుంచి రావ చ్చునని ఆశాభావాలు వ్యక్తమవ్ఞతున్నాయి. టి-హబ్‌ద్వారా ఇప్పటికే ఎన్నో పరిశ్రమల స్థాపనకు రెడ్‌కార్పెట్‌ తెలంగాణ ప్రభుత్వం పరిచింది. పారిశ్రామికీకరణవైపు దూసుకువెళ్తోం ది. ఇప్పుడు ఈసదస్సుఅనంతరం ప్రారంభించిన వి-హబ్‌ కూడా అదేబాటలో నడిపేందుకు ప్రభుత్వం కృషిచేస్తు న్నది. అలాగే చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. తెలం గాణలో పద్దెనిమిది లక్షలకుపైగా చిన్న,సూక్ష్మ, సేవా రంగపరిశ్రమలున్నాయి. కానీ అవి తీవ్రమైన సంక్షోభంలో కొట్టుకుమిట్లాడుతున్నాయి. ఇందుకు కారణాలెన్నో ఉన్నా యి. చాలామంది చిన్న పారిశ్రామికవేత్తలు కోలుకోలేకపో తున్నారు. బ్యాంకులుకూడా వారికి సహకరించడంలేదు. చిన్న పరిశ్రమల విషయంలో కూడాపాలకులు శ్రద్ధతీసుకొని వారినికష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రయత్నించాలి.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌