‘పెద్దల’ ఎంపికలో ఇంకా ఉత్కంఠ

‘పెద్దల’ ఎంపికలో ఇంకా ఉత్కంఠ
కోనేటి రంగయ్య / హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో ఇతర సమస్యలన్ని ప్రస్తుతం పక్కకుపోయి రాజ్య సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపైనే తాజాగా అధిక చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికలను పురష్కరించుకొని మరో సారి పార్టీ పిరాయింపుదారుల వ్యవహారం కీలకాంశమైంది. విభజన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్, ఎపిలో తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే తమ బలం, బలగాన్ని పెంచుకునేందుకు ఈ రెండు పార్టీలు కూడా పిరా యింపులను పెద్దయెత్తున ప్రోత్సహించాయి. అధికార పార్టీల ప్రలో భాల వల్ల భారీగానే ఎంఎల్ఎలు కప్పల వలె గెంతి పాలకపక్షంలో చేరిపోయారు.
దీంతో పిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఎపిలో వైఎస్ఆర్సిలు పదేపదే స్పీక ర్లకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారం పెండింగ్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో పిరాయింపులపై మరోసారి స్పీకర్ దృష్టికి తెచ్చేందుకు వీలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యసభ ఎన్ని కలను వినియోగించుకుంటున్నది. కాగా ఎపిలో తెలుగు దేశం పార్టీ ఇలాంటి సమస్య రాకుండా ముందస్తు నిర్ణయం తీసుకొనడం గమ నార్హం. ప్రతిపక్ష వైఎస్ఆర్సి కూడా తగినంత బలం ఉండటంతో కేవలం రెండు సీట్లకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుం ది.
కాగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించక పోవడంతో పార్టీలో తీవ్ర ఉత్కంఠత కొనసాగుతున్నది. ఇక తెలంగా ణలోనూ అధికార టిఆర్ఎస్పార్టీ ఇంకా అభ్యర్థులను అధికారికంగా వెల్లడిచేయలేదు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఎపిలో మూడు,తెలంగాణలోనూ మూడుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా యి.