పెడ‌దోవ‌లో ప‌ల్లె ప్ర‌గ‌తి నిద్రః కోదండ‌రామ్‌

Kodanda ram
Kodanda ram

భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీజేఎస్ అధినేత‌ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తెలంగాణ జనసమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇసుక మాఫియా పెరిగిపోయిందన్నారు. భూపాలపల్లి జిల్లాను అభివృద్ది చెయ్యడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పల్లె ప్రగతి నిద్ర పేరుతో మధుసూదనాచారి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజల ఎజెండానే తెలంగాణ జనసమితి ఎజెండా అని కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరించిన కోదండరామ్.. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు రాజకీయ ప్రత్యర్థిగా మారారు.