పెట్రో ధ‌ర‌లు పెంపు.. భ‌రించాల్సిందేః మంత్రి ధ‌ర్మేంద్ర‌

Dharmendra Pradhan
Dharmendra Pradhan

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. తప్పనిసరి పరిస్థితులే అందుకు కారణమంటూ ఆయన ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘ఇంధనం ధరల పెరుగుదల వ్లల దేశ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారని నేను అంగీకరిస్తాను. ఒపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించేయడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బాగా పెరిగిపోవడం ఇందుకు కారణం. భారత ప్రభుత్వం త్వరలోనే ఒక పరిష్కారంతో ముందుకు వస్తుంది’ అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే ఆలోచన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కూడా మంత్రివర్యులు తేల్చేశారు. పందొమ్మిది రోజుల పాటు కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకూ సైలెంట్‌గా ఉన్న పెట్రోలియం సంస్థలు…ఆ ఎన్నికలు మగిసిన రెండు రోజులకే రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధలు పెంచేశాయి. రోజవారీ రివైజ్డ్ ధరల ప్రకారం తాజాగా మరోసారి పెట్రో పంజా విసరడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.80 దాటేసింది. డీజిల్ సైతం రూ.73కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడుల్లా రవాణా చార్జీల పేరుతో నిత్యావసరాల ధరలు అమాతం పెరిగిపోవడం రివాజే కావడంతో రాబోయే పరిణామాలు తలుచుకుని సామాన్యప్రజానీకం మరోసారి వణికిపోతోంది.