పెట్టుబడులపై 18-19% రిటర్నులు

b7

పెట్టుబడులపై 18-19% రిటర్నులు

ముంబై, సెప్టెంబరు 8: టెలికాం రంగంలో దేశవ్యాప్త సర్వీసులను ప్రారంభించిన ఆర్‌జియో తన పెట్టుబడులపై అతిస్వల్ప వ్యవధిలోనే 18-19శాతం రిట ర్నులు సాధిస్తామని ధీమా వ్యక్తంచేసింది. ఆర్‌జియోపై 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టామని, భారత్‌ టెలికాం మార్కెట్‌లలో అతితక్కువధరలకే డేటా అందిస్తున్నట్లు ఆయన ఒక ఆర్థికసేవల పత్రికకు ఇంటర్వ్యూలో పేర్కొ న్నారు.

ఆర్‌జియో ద్వారా మాపెట్టుబడులకు ఎటువంటి నష్టం ఉండదని, ఎట్టిపరిస్థితుల్లోను 18-19శాతం రిటర్ను లుంటాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రిల్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతరకంపెనీల షేర్లు భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వంటివి భారీగా పతనం చెందాయి. అంబాని తన ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తూ రిలయన్స్‌ పని తీరు గడచిన 40 ఏళ్లుగా పరిశీలించాలని సూచించారు. సంఘటిత వార్షిక వృద్ధితో నడిచిం దని ఆయన అన్నారు. వాటాదారులకు 20శాతానికి మించి రిటర్నులు అందించినట్లు వివరించారు. మాకున్న ఇన్వెస్టర్లు ప్రస్తుత వాతా వరణాన్ని అర్ధం చేసుకోగలరని ఆయన అన్నారు.

కంపెనీకి 120 మిలియన్ల చందాదారులు వచ్చినపక్షంలో నెలకు రూ.500 సగటు బిల్లింగ్‌ జరిగితే 72 వేల కోట్ల విలువలకు చేరుతుందని, అదికూడా లాభనష్టాలులేని దశ అని చెప్పలేమన్నారు. మొదటిపూర్తి సంవత్సర కార్యకలాపాల్లో రిలయన్స్‌ 120 మిలియన్ల కస్టమర్లను సాధించినపక్షంలో 2018 నాటికల్లా ఎక్కువ తరుగు దల, వడ్డీఖర్చులు కలిపి 2017, 2018లలో కూడా నష్టాలు చవిచూసే అవకా శం ఉంటుందన్నారు. 100 మిలియన్‌ వినియోగదారులు లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్‌జియోతో ఇంటర్‌కనెక్టివిటీకి విముఖంగా ఉన్న సంస్థలు భారీ టెలికాం బిజినెస్‌ సంస్థలేనని ప్రస్తుత నిబంధనలకు అనుగు ణంగా అవి మారతాయనే విశ్వాసం ఉందన్నారు.

లైసెన్సు నిబంధనల ప్రకారం టెలికాం ఆపరేట ర్లు ఇంటర్‌కనెక్ట్‌ పాయింట్స్‌ అందించాల్సి ఉంటుంది. అయితే టెల్కోలన్నీ కలిసి ప్రధాని కార్యాలయానికి వినతిపత్రం పంపిస్తూ ఆర్‌జియోకు పోల్స్‌ అందిం చేందుకు అవసరమైన నెట్‌వర్క్‌, ఆర్థిక వనరులు లేవని వివరించాయి. కొత్త సంస్థ నుంచి ఎక్కువగా వాయిస్‌ కాల్స్‌ చందాలు నష్టపోతామన్న భయంతోనే ఈ కంపెనీలు ఈవిధంగా చేస్తున్నట్లు ఆర్‌జియో వెల్ల డించింది. ప్రస్తుత సామర్ధ్యం 70శాతానికి మించితే ఇంటర్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌ను పెంచుకోవాల్సి ఉంటుందని అంబాని వెల్లడించారు. ట్రా§్‌ు జియో ఇతర కంపెనీలు ఇందుకు సంబంధించి ఒక సమగ్ర సమావేశం నిర్వహిం చాలనినిర్ణయించారు. అయితే సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వివరాలను చూస్తే జియోకునెట్‌వర్క్‌ ఇచ్చేందుకు విముఖంగాఉన్నట్లు కనిపిస్తోంది.