పెటైనర్ ఇన్నోప్యాక్ నుంచి పెట్ కంటైనర్లు
ముంబై : మేకిన్ ఇండియా స్ఫూర్తితో దేశంలోప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో పెటైనర్ ఇన్నోప్యాక్ పాకే జింగ్ యూనిట్ ప్రారంభం అయింది. ముంబై సమీపంలో అత్యాధునిక యూరప్ లోని పెటైనర్స్ తయారీ కేంద్రాలనుంచి ఉత్పత్తి అయిన ప్రిఫామ్స్ ఉపయోగిం చడం ద్వారా 20 లీటర్ల బల్క్ వాటర్ కంటైనర్ జార్ పెటైనర్ కూలర్‌ను తయారుచేస్తోంది. అంతర్జా తీయ స్తాయిలో బ్లోమౌల్డింగ్ ఉపకరణాలతో పాటు ఆన్సైట్ డిజైన్ స్టూడియో లేబొరేటరీ సేవలు గోదాములు కూడా ఇదే ఉత్పత్తి కేంద్రంలో ఏర్పాటుచేసారు 20లీటర్లు, 30 లీటర్ల కెగ్పెటైనర్కెగ్ను ప్రవేశపెట్టింది. పెటైనర్ యూకె హోల్డింగ్ గ్రూప్ సిఇఒ నిగెల్ప్రిట్చార్డ్ మాట్లాడుతూ కొత్త ప్యాకేజింగ్ పరిష్కారాలకు భారత్ ఉద్వేగభరిత చలనశీలక మార్కెట్ అవకాశాలు అందిస్తామన్నారు. భారతీయు అత్యధికంగా విశ్వసించే బ్రాండ్ ఉత్పత్తులనే కస్టమర్లకు చేరువచేస్తామన్నారు. ఇన్నోప్యాక్ కంటైనర్్స సంస్థ ఆటిట్భాటియా, సాకేత్భాటియాలు భారత్‌లో స్థాపించారు పెటైనర్ ఇన్నోప్యాక్ ప్యాకేజింగ్ జాయింట్ వెంచర్ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పరిష్కారాలు అందిస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్త కార్యకలాపాలు సాగిస్తున్నది.