పూలతో వైద్యం చూడంగ చోద్యం

Batukamma2

This slideshow requires JavaScript.

 పూలతో వైద్యం చూడంగ చోద్యం

పూలతో వైద్యం ఉయ్యాలో చూడంగ చోద్యము ఉయ్యాలో

తంగేడుపూలతో ఉయ్యాలో

తనువంత బతుకమ్మ ఉయ్యాలో

అగ్రభాగాన ఉండి ఉయ్యాలో

అందంగ కన్పడును ఉయ్యాలో

తంగేడు పూలతో ఉయ్యాలో

తగ్గేను మలబద్దకము ఉయ్యాలో

చక్కెరా వ్యాధికి ఉయ్యాలో

చక్కనిది తంగేడు ఉయ్యాలో

కాంతిరంగు కాయం ఉయ్యాలో

కన్పించు ఖాయమ్ము ఉయ్యాలో

అన్నింటిలోన ఉయ్యాలో

ముందుండు గుమ్మడి ఉయ్యాలో

ఆకులూ, పూలతో ఉయ్యాలో

అతిమూత్ర వ్యాధులు ఉయ్యాలో

కీళ్లవాతము తగ్గి ఉయ్యాలో

కంటి జబ్బులు మగ్గి ఉయ్యాలో

కనువిందు జేయును ఉయ్యాలో

కంటికి మందవ్ఞను ఉయ్యాలో

తామరపూలతో ఉయ్యాలో

తనువంత స్వచ్ఛతా ఉయ్యాలో

రక్తస్రావమ్మును ఉయ్యాలో

ర§్‌ుమంటు తగ్గించు ఉయ్యాలో

చర్మసంబంధ రోగమ్మ ఉయ్యాలో

ఛెల్లు చీటిచ్చును ఉయ్యాలో

పూలెన్ని ఉన్నాను ఉయ్యాలో

33 బంతిపూలె బాసు ఉయ్యాలో

కాలినా గాయాలు ఉయ్యాలో

కళ్ల కలతలన్నీ ఉయ్యాలో

అంటువ్యాధులేవీ ఉయ్యాలో

దరిచేరనివ్వక ఉయ్యాలో

కాంతి వంతమ్ముగ ఉయ్యాలో

కాయమెపుడు మెరువరు ఉయ్యాలో

పసుపు తెలుపు వర్ణాల ఉయ్యాలో

పచ్చనీ చామంతి ఉయ్యాలో

మధుమేహ వ్యాధిని ఉయ్యాలో

మాయమే చేయును ఉయ్యాలో

ఒత్తిడి, కోపము ఉయ్యాలో

ఒట్టుగా లేకుండా ఉయ్యాలో

భావోద్వేగాలను ఉయ్యాలో

బాధ్యతగా నిలుపును ఉయ్యాలో

అందాల మందార ఉయ్యాలో

అనువ్ఞగా బతుకమ్మన ఉయ్యాలో

గుండె జబ్బులాకు ఉయ్యాలో

గురువ్ఞలా పనిచేయు ఉయ్యాలో

వెంట్రకలా వెలుగుకు ఉయ్యాలో

వెను తిరగనీ మందు ఉయ్యాలో

మొటిమల, మచ్చలు ఉయ్యాలో

మొఖముపై రాకుండా ఉయ్యాలో

మందార మెపుడూ ఉయ్యాలో

మంచి వైద్యుడిగాను ఉయ్యాలో

పూలల్లో రాజోలె ఉయ్యాలో

గులాబీ రోజాలు పూలన్నీ బతుకమ్మ ఉయ్యాలో

పూరేకుతో బతుకు ఉయ్యాలో

రోజ్‌వాటరులాగ ఉయ్యాలో

రోజంతా వాడినా ఉయ్యాలో

ఆంటిబయొటిక్‌గా ఉయ్యాలో

ఔషధంగా మందారం ఉయ్యాలో

ముఖకాంతి పెంచంగ ఉయ్యాలో

ముందు స్థానముంచంగ ఉయ్యాలో

గడ్డి జాతిపువ్వూ ఉయ్యాలో

గునుగమ్మ పేరుతో ఉయ్యాలో

అతిసార వ్యాధికి ఉయ్యాలో

అసలైన విరుగుడు ఉయ్యాలో

పెద్దపేగులోని ఉయ్యాలో

పెరుకున్న మైలను ఉయ్యాలో

రుతుస్రావ బాధలు ఉయ్యాలో

రుజుమార్గన తొల్గించు ఉయ్యాలో

రక్తపోటు రాకుండా ఉయ్యాలో

రాజోలె గుండెకండ ఉయ్యాలో

దీనిసాటిలేదుఉయ్యాలో

దీనికెదురు లేదు ఉయ్యాలో

-గోదా