పూర్తి సమయం ప్రజా జీవితానికే

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌
హైదరాబాద్‌: తన పూర్తి సమయం ప్రజా జీవితానికే పనిచేస్తానని జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తపై స్పందిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాలేవీ చేయబోవడం లేదని, ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలపలేదన్నారు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదని, ప్రజా జీవితానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. ప్రజల్లోనే ఉంటూ జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిదని తెలిపారు. సినిమాలపై ఎటువంటి దృష్టి సారించడం లేదని, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలన్నీ తప్పుడు వార్తలేనని ఖండించారు. తన ఆలోచనలు, తపన అంతా ప్రజా క్షేమం, సమసమాజ స్థాపన కోసమేనని పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.