పూర్తికావచ్చిన ‘సింగం 3’

suriya
ఇటీవల విడుదలైన 24 తో సూపర్‌హిట్‌ అందుకున్న సూర్య ప్రస్తుతం తమిళ్‌ దర్శకుడు హరి దర్శకత్వంలో ‘సింగం-3’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజా సమాచారం ప్రకారం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు పూర్తికావచ్చినట్టు తెలిసింది.. ఇక టాకీ పార్ట్‌ పూర్తికాగానే పాటలు చిత్రీకరిస్తారని తెలిసింది.

హరీస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్న ఈసినిమా అడియోను జూలై రెండవ వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జ్ఞానవేళ్‌ రాజునిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈసినిమా కు ప్రియన్‌ సినిమాటోగ్రాఫర్‌. సింగం-1, 2 తరహాలో ఈసినిమా స్క్రీన్‌ప్లే చాలా వేగంగా ఉంటుందని తెలిసింది.