పూరీ దర్శకత్వంలో రవితేజ!

పూరీ దర్శకత్వంలో రవితేజ!
ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటైన ‘రాజా ది గ్రేట్ అక్టోబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇటీవల కాలంలో రవితేజకి చెప్పకోదగిన హిట్ లేదు. దాంతో ఆయన గతంలో తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో కలిసి మళ్లీ పనిచేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గతంలో ఈ ఇద్దరి కాంబేనేషన్లో ‘ నీకోసం … ‘వెంకీ .. ‘దుబా§్ు శ్రీను వంటి హిట్స్ వచ్చాయి. ఇక వినాయక్తోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడనే వార్త బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ ఇద్దరు కలిసి చేసిన ‘కృష్ణ హిట్ చిత్రాల జాబితాలో చేరింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి రవిజేత ఇంట్రెస్ట్ చూపుతున్నాడనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో ”నేనింతే.. ‘ఇడియట్.. ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి.. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి హింట్స్ వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేయబోతుందన్నమాట.