పూరి-బాలయ్యల.. ‘పైసా వసూల్‌’

BALA KRISHNA NEW LOOK-1
BALA KRISHNA NEW LOOK

పూరి-బాలయ్యల.. పైసా వసూల్‌!

నందమూరి బాలకష్ణ ,పూరిజగన్నాధ్‌ ల సెన్సషనల్‌ కాంబినేషన్‌ లో భవ్య క్రియేషన్స్‌ పతాకం పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి పైసా వసూల్‌ అనే టైటిల్‌ ఖరారు చేసారు. జూన్‌ 10 నందమూరి బాలకష్ణ పుట్టినరోజు. ఈ సంధర్భంగా సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసారు. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ.. పైసా వసూల్‌ అనే టైటిల్‌ ఈ కథ కు యాప్ట్‌. కచ్చితంగా బాలకష్ణ గారి ఫాన్స్‌, ఆడియన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. బాలకష్ణ గారితో పని చేస్తున్నందుకు హ్యాపీ గా వుంది. ఈ సినిమాలో ఆయన స్టైలిష్‌ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఫెంటాస్టిక్‌ గా ఉంటాయి.

ఈ మధ్య కాలంలో బాలకష్ణ గారు సీరియస్‌ గా ఉండే రోల్స్‌ చేస్తున్నారు. ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్‌ రోల్‌ చేస్తున్నారు. నిజం గా అభిమానులకి పండుగే ఈ సినిమా. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్‌ ఎపిసోడ్స్‌ లో ఫారిన్‌ సాంకేతిక నిపుణులు మరియు ఫైట్‌ మాస్టర్స్‌ పని చేశారు అని తెలిపారు. నిర్మాత వి. ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. మే 12 నుంచి పోర్చుగల్‌ లోని లిస్బన్‌ , పోర్టో సిటీలలో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్‌ లో షూటింగ్‌ చేస్తున్నాము. ఈ నెల 16 వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. బాలకష్ణ గారి పుట్టిన రోజు సందర్భం గా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి ఫేస్‌ బుక్‌ లో లైవ్‌ ఏర్పాటు చేసాం . బాలకష్ణ గారు మరియు పూరి జగన్నాధ్‌ గారు ఈ లైవ్‌ లో పాల్గొని అభిమానులని ఆనందపరుస్తారు. బాలకష్ణ గారు పాల్గొనే ఫస్ట్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌ ఇదే. బాలకష్ణ గారి 101వ చిత్రం గా రూపొందుతున్న ఈ చిత్రం లో శ్రేయ, ముస్కాన్‌, కైరా దత్తు హీరోయిన్లు గా నటిస్తున్నారు అని చెప్పారు.