పూంచ్ సెక్టార్ వ‌ద్ద కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ పాక్ సైన్యం!

Poonch Sector
పూంచ్‌: కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ సమీపంలో సరిహద్దుల వద్ద పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.  దీంతోపాటు భీంభర్‌ గలీ సెక్టార్‌లో కూడా పాక్‌ దళాలు కాల్పులకు దిగాయి. వీటికి దీటుగా భారత బలగాలు  కూడా స్పందిస్తున్నాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్న‌ట్లు స‌మాచారం.