పుస్తకాల చదువులను ప్రోత్సహించాలి: రామచంద్రన్‌

BREAKING NEWS
BREAKING NEWS

విద్యానగర్‌: పెరిగిన అధునిక సాంకేతిక పరిజ్ఞానం సమాజాన్ని పుస్తక పఠనానికి దూరం చేస్తున్నదని ఉస్మానియా యూనివర్శిటి వైస్‌-చాన్సలర్‌ ప్రోఫెసర్‌ ఎస్‌.రామచంద్రన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటి విద్యార్థులు సైతం పుస్తక పఠనంపై అసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. ఎన్‌టిఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ జాతీయ బుక్‌ ఫెయిర్‌లో భాగంగా సోమవారం జాతశ్రీ వేదికపై ఎఎల్‌ఎస్‌డి ఆధ్వర్యంలో బయోగ్రాఫికల్‌ డిక్షనరి ఆఫ్‌ ఇండియన్‌ లైబ్రరి అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సైన్స్‌ ప్రోఫెషనల్‌ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా విసి రామచంద్రన్‌ మాట్లాడుతూ అందరూ పుస్తకాలు చదివేలా మరింత ప్రోత్సహించాలిసిన అవసరం ఉందన్నారు. పుస్తక పఠనంతో ఎంతో విజ్ఞానాన్ని పెంపోందించుకోవచ్చునని, విజ్ఞానంతో విలువలు పెరుగుతాయని చెప్పారు. బయోగ్రాఫికల్‌లో డిక్షనరిలో అందరికి ఉపయోగపడే విషయాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ప్రతి ఓక్కరూ పుస్తకాల చదువులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తెలంగాణ గ్రంధాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రోఫెసర్‌ గోపాల్‌రెడ్డి, అధ్యాపకులు ఎఎల్‌ రాజు, ఎల్‌ఎఫ్‌ రామయ్య, శ్రీకాంత్‌రెడ్డి, సుదర్శనరావు, రవీంద్రాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.