పుష్కర ఘాట్లకు పున్నమి రద్దీ

chinaaa
నేడు పుష్కర ఘాట్లకు పున్నమి రద్దీ

ట్రాఫిక్‌ నియంత్రణకు గట్టి చర్యలు
ఇప్పటిదాకా పుణ్యస్నానాలాచరించినవారు 74 లక్షలపైనే: హోం మంత్రి చినరాజప్ప

 

విజయవాడ: గురువారం,రాః పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పుష్క స్నానం ఆచరించేందుకు యాత్రికులు వస్తారని, దానికి తగ్గట్టుగా ట్రాఫిక్‌ నియంత్రణా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.విజయవాడ లోని ఎఆర్‌ గ్రౌండ్స్‌లో ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియంత్రణ సేవలు అమలు చేసేందుకు 32 వేల మంది పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. పుష్కరాల సందర్భంగా పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 12 నుండి ప్రారంభమైన పుష్కరాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు 74 లక్షల పైన భక్తులు పుష్కర స్నానమాచరించార న్నారు.