పుల్వామా ఘటన, కేసిఆర్‌ జన్మదిన వేడుకలకు దూరం

kcr
kcr

హైదరాబాద్‌: పుల్వామా ఘటనను తెలంగాణ సియం కేసిఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది జవాన్లు మృతి చెందడంతోపాటు చాలా మందికి తీవ్రగాయాలవడం పట్ల సియం కేసిఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతిచెందిన జవాన్ల కుటుంబాలకు సియం కేసిఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనతో తాను తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన జన్మదినం సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సియం కేసిఆర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా వేడుకలు చేయరాదని అభ్యర్థించారు.