పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన 

పిఠాపురం (తూ.గో.): పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు సిఎం చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు.రూ.1638 కోట్లతో నిర్మాణం చేయనున్నారు.. తూర్పుగోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల మెట్టప్రాంత రైతులకు సాగునీరు అందించనున్నారు. దీంతో జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాలోని 87వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ కానుంది. కాగా విశాఖ జిల్లాలో మంచినీరు,పారిశ్రామిక అవసరాలు తీర్చటమే లక్ష్యంగా 9నెలల్లో పురషోత్తమపట్నం ఎత్తిపోతల పనులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.