పునరుద్ధరణలో కొచ్చి విమానాశ్రయం

Kochi airport
Kochi airport

కొచ్చి: కేరళ ప్రకృతి ప్రకోపానికి గురైన విషయం విదితం. కాగా వరదల కారణంగా మూతపడిన కొచ్చి విమానాశ్రయంలో రేపటి నుంచి మళ్లీ పూర్తిస్థాయి కళశాలలు ప్రారంభం కానున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాభివృద్ధి లిమిటెడ్‌(సిఐఏఎల్‌)లో పూర్తిస్థాయి కార్యకలపాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం మధ్యాహ్నాం 2గంటల నుంచి అంతర్జాతీయ దేశవాళీ సర్వీసులు ఆరంభమవుతాయని సిఐఎఎల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమాన సంస్థలకు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన విమానాశ్రయాధికారులు షెడ్యూల్‌ ప్రకారం సజావుగా సర్వీసులు నడిచేలా సహకరించాలని కోరింది. కాగా రేపటి నుంచి ప్రయాణీకులు టిక్కెట్‌లు బుక్‌ చేసుకునేలా ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్లు సైతం ఏర్పాట్లు ఆరంభించాయి. కొచ్చి నావికా స్థావరం నుంచి విమాన సర్వీసుల ద్వారా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లు కూడా రేపటి నుంచి నిలిపివేయనున్నారు.