పుదుచ్చేరి నామినేటెడ్ ఎమ్మెల్యేల‌ అరెస్ట్‌

Narayana swamy & Kiran bedi
Narayana swamy & Kiran bedi

పుదుచ్చేరి: నామినేటెడ్‌ ఎమ్మెల్యేల విషయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి మధ్య రాజుకున్న వివాదం క్రమంగా ముదురుతోంది. గవర్నర్‌ నామినేట్‌ చేసిన ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను సభలో ప్రవేశించేందుకు స్పీకర్‌ నిరాకరించిన విషయం విదిత‌మే. సోమవారం నాడు బడ్జెట్‌ సమావేశాలలో పాల్గొనేందుకు వారు సభలో ప్రవేశించేందుకు ప్రయత్నించటంతో పుదుచ్చేరి సర్కారు వారిని అరెస్ట్‌ చేసింది. కాగా 1963 నాటి కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం ప్రకారం వీరి నామినేషన్లను చెన్నరు హైకోర్టు సమర్ధించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఉన్నత న్యాయస్థానం వారికి సూచించింది.