పుణ్య ధనుడు పోతన్న

ఎవరికైనా ‘పోతన పద్యం విన్న తర్వాత, అది అర్థం కానక్కరలేదు, మనస్సు మాత్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అలాగే ‘తిరుపతి వేంకట కవ్ఞల పద్యం సంగతి చెప్పనక్కర్లేదు. ‘పోతన పద్యవైశిష్ట్యాన్ని, విద్యార్థులకు ముఖ్యంగా ఉపయోగపడాలి. నాటకపరంగా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు త్రాసులో కూర్చున్న సమయంలో ఆయనను తూచడానికి సత్యాదేవి ఆమెకున్న నగలూ నట్రా, అన్నీత్రాసులో ఒకపక్కన వేసినప్పటికీ తూగడు. అదేం చిత్రమో, రుక్మిణీదేవి భక్తితో ఒక్క ‘తులసి దళం ఉంచేటప్పటికీ సరి తూగుతాడు. మిగతా గ్రంథాలూ, కావ్యాలూ, ప్రబంధాలూ ఒక ఎత్తయితే, ‘పోతన భాగవతం నిజంగానే ‘తులసి దళం లాంటిదే! ఈ భాగవతంలో ఉన్న శబ్దమాధుర్యం అటువంటిది.

పుణ్య ధనుడు పోతన్న

ఈ మధ్య కాలంలో మళ్లీ ‘పద్య విద్య మీద మన తెలుగు ప్రజానీకానికి ఎక్కడలేని భక్తిశ్రద్ధలు పెరిగాయి. అవధానాలు, ప్రవచనాల సంగతి సరేసరి. నిజం చెప్పాలంటే పౌరాణిక నాటక ప్రదర్శనలే కొంచెం తగ్గాయి అని అనిపిస్తుంది. ఏది ఏమైనా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న చిన్న పిల్లలకు కొన్ని కొన్ని సాహిత్య సంస్థలు పద్యపఠన పోటీలు పెట్టి వాళ్ల చేత అద్భుతమైన ఘట్టాలలోని పద్యాలను పాడించ డం, లేదా భావయుక్తంగా చదివేలా నేర్పించడం చూస్తున్నాం! ‘ఆముక్త మాల్యద లాంటి ప్రౌఢ గ్రంథాలలోని పద్యాలను కూడా 10,15 సంవత్సరాల పిల్లలు శ్రుతి సుభగత్వంగా చదువగలుగుతున్నారంటే తెలుగు శారద ఎంత ధన్యురాలో తెలుస్తున్నది. ఈ పరంపరలో హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో వెలుగొందుతున్న ‘భారత్‌ వికాస్‌ లాంటి సంస్థలు సంగీత సాహిత్య నాటకాలకు చేస్తున్న సేవ నిరుప మానం. నిలువెల్లా జాతీయ భావాలు నింపుకున్న పెద్దలు, శ్రీ అశ్విని సుబ్బారావ్ఞ గారు,చింతపెంట హనుమంతరావ్ఞ గారి లాంటి వాళ్లు పరోక్షంగా తెనుగు పద్యానికి చేస్తున్న సేవ అంతా ఇంతగాదు. ఏ మాత్రమూ తెనుగు సాహిత్యంతో సంబంధమే లేని, అసలు సిసలైన తెలుగు భాషాభిమాని, పద్యాభిమాని, బి.హెచ్‌.ఇ.ఎల్‌ లాంటి సంస్థలో ఉన్నతోద్యోగం (ఇంజనీర్‌) చేసి విశ్రాంతి తీసుకుంటున్న మిత్రులు ఘట్టి కృష్ణమూర్తి మహోదయుల వంటి వారి సేవ గూర్చి చెప్పడం కష్టం. ఘట్టి కృష్ణమూర్తి, సాధన నరసింహా చార్యులు, ఇంకా పేర్లు గుర్తుకు రావడం లేదు. కానీ వారందరూ పద్యం పట్ల వీరాభిమానులే! గొప్పపద్యాలూ, ధారణలూ, పోటీలు, బహుమదితి ప్రదానాలూ ఒక ఎత్తు. మన పోతన్న గారి ఆంధ్ర మహాభాగవతంలో నుంచి పిల్లలకు కొన్ని కొన్ని పద్యాలు యేరి ఒక ప్రణాళికను సిద్ధం చేసి, పోటీలు నిర్వహించి, వారికి బహుమతులను ఇవ్వడం మరో ఎత్తు. ఎవరికైనా ‘పోతన పద్యం విన్న తర్వాత, అది అర్థం కానక్కరలేదు, మనస్సు మాత్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అలాగే ‘తిరుపతి వేంకట కవ్ఞల పద్యం సంగతి చెప్పనక్కర్లేదు. ‘పోతన పద్యవైశిష్ట్యాన్ని, విద్యార్థులకు ముఖ్యం గా ఉపయోగపడాలి. నాటకపరంగా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు త్రాసులో కూర్చున్న సమయంలో ఆయనను తూచడానికి సత్యాదేవి ఆమెకున్న నగలూ నట్రా, అన్నీత్రాసులో ఒకపక్కన వేసినప్పటికీ తూగడు. అదేం చిత్రమో, రుక్మిణీదేవి భక్తితో ఒక్క ‘తులసి దళం ఉంచేటప్పటికీ సరి తూగుతాడు. మిగతా గ్రంథా లూ, కావ్యాలూ, ప్రబంధాలూ ఒక ఎత్తయితే, ‘పోతన భాగవతం నిజంగానే ‘తులసి దళం లాంటిదే! ఈ భాగవతంలో ఉన్న శబ్దమాధుర్యం అటువంటిది. నిజానికి ‘నాదం మనస్సును ఆహ్లాదపరుస్తుంది.’నాదం అంటే ఏమిటో త్యాగరాజు గారు అందరి కన్నా గొప్పగా చెబుతాడు.’నాద తనుమనిశం, శంకరం, అంటూ ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ పోతాడు. నాదం, వేదం, ఖేదం, మోదం మొదలైన వాటన్నింటిని గూర్చి చెప్పిన మహానుభావ్ఞలెంత మంది ఉన్నా, ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానిస్తూపోయినా మనకు మస్తిష్కంలో మెదిలేది మాత్రం మన పోతరాజుగారే! అందుకే కరుణశ్రీ గారు గుడులను గూర్చి, రాగాలను గూర్చి తనకు తోచిన ధోరణిలో చిన్న తేటగీతిని చెబుతూ ‘పుణ్యకృతి వ్రాసె బమ్మెరపోతరాజు అంటాడు. నిజంగా తెలుగు భాగవతం కన్నా పుణ్యకృతి యేముంటుంది? ఆయనే చెప్పినట్లు గంటాన్ని ‘పంచదారలో నిజంగానే అద్ది వ్రాసి ఉంటాడు. పోతనగారు ఎక్కడా తన గొప్పదనాన్ని చాటుకోడు. మహా వినయంగా మాట్లాడుతాడు. ఆయన బావగారిలాగా (అవ్ఞనో, కాదో అది వేరే విషయం)మీసాల ద్రిప్పుడు. ‘శూలికైనా, తమ్మిచూలికైనా తెలిసి పలుకుట యనేది-చాలా విచిత్రం, అంటాడు. అంతేగాదు ‘విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరుస్తాననడం ఆయన అసలు సిసలైన వ్యక్తిత్వానికి నిదర్శనం. ‘నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడ నయ్యెద నని తన కన్నా పూర్వ కవ్ఞలు కొందరు పలికి నా, అంతకన్నా భక్తి శ్రద్ధలతో, వినయంతో సాధుశీలిగా పాఠకులకు కళ్లముందు ప్రత్యక్షమవ్ఞ తాడు మన పోతన- నన్నయ, తిక్కనాది కవ్ఞలు పురాణాలను తెనుగు చేసే సందర్భాలలో ఈ భాగవ తాన్ని ముట్టుకోకపోవడం తన అదృష్టంగా భావిస్తాడు. అది నిజంగా తన ‘పురాకృత శుభాధిక్యం అని మురిసిపోతాడు. ఎంత నమ్మకమున్నవాడు కాకపోతే ‘మజ్జననంబున్‌ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్‌ అని అనగలుగుతాడు. ఎన్ని వేదాలు చదివినా, పురాణాలు పఠించినా అవి సుగమములు కావట… చిన్ని చిన్ని పొడి పొడి మాటలతోనే అందంగా చిన్న కందంలో ఎలా చెప్పాడో గదా? ‘నిగమములు వేలు చదివిన- సుగమంబులు గావ్ఞ ముక్తి సుభగత్వంబుల్‌, సుగమంబు ‘భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా – అని ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడో పోతన అనిపిస్తుంది. అసలు మొదలు మొదలే ‘శ్రీ కైవల్య పదం చేరడానికి ఎవర్ని ఎలా ఎలా స్తుతించాలో, ఆ పరమ పురుషుని గుణగుణాలేమి టో- అంత అందంగా శార్దూలంలో చెప్పిన మరో కవి కనబడడు. ‘హరి వంశం లాంటి మహాగ్రంధాన్ని రచించిన ‘ఎర్రన గారిని తక్కువ చేయడం కాదు గాని, శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు, వర్ణనలూ పోతన గారివి చదువ్ఞతున్నప్పుడు పాఠకుడికి అసలు మరో కవి మనఃపథంలో మెదలడు. మెదలనివ్వడు పోతన. అది ఈ కవి హాలికుడి ప్రత్యేకత. ప్రత్యేకత అనే దానికన్నా అతని భాగ్యం, అదృష్టం, యోగం- ఇలా ఏమైనా చెప్పవచ్చు.’భక్తి లేక ‘వైర భక్తి చిత్రణలో ‘పోతనను మించిన మరో కవి ఆంధ్ర సాహిత్యంలో కనిపించడంటే అతిశయోక్తి గాదేమో? ‘అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తం నిరంతరం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందట. పానీయాలు త్రాగండి. మధుర పదార్థాలు భుజించండి. యింకేమన్నా కానివ్వండి. నిజమైన భక్తుడికి విష్ణుదేవ్ఞడి చరణాలు మీదనే ధ్యాస ఉంటుందట. కేవలం యేదో ఇలా అంటే అంటున్నాడు పోనీలే, ఆయనకు తోచినదీ, నమ్మిందీ చెప్పాడనుకోవచ్చు. కానీ నాస్తికుల గూబలు గుయ్యిమనేలా, తన చెప్పుతో తానే కొట్టుకుందామా అనే అంత ఆవేశం కలిగేలా బలే బలే గమ్మతైన సీసాలు చెబుతాడు- ‘విష్ణు కీర్తనములు వినవి కర్ణంబులు కొండ బిలములు అంటాడు. చక్రిని గూర్చి పలుకని పద్యాలు లేక గద్యాలు గూడా అనుకోండి, అవి కప్పల జిహ్వల లాంటివట. ‘కప్పల బెకబెకలు ఎలా ఉంటాయో శ్రీనాథుడి కన్నా అందంగా చెప్పిన మరో కవి లేడు. అది వేరే విషయం. ఆయన గారి బావ అంటుంటారు గాబట్టి ఠక్కున ఆయన గుర్తుకు వచ్చాడు. ‘హరి పదతులసీ దళామోద రతిలేని ముక్కు, అయ్యబాబో§్‌ు… యాక్కు ‘పంది ముక్కట… ఇలా ఒక్కోసారి భయపెడతాడు. నాస్తికాళిని బెదిరిస్తాడు. కళ్లెర్ర చేస్తాడు. అలా కాకుండా నిజంగానే సుమధుర సుందర శబ్దజాలంతో హరికీర్తన చేసే సందర్భాలలో మనకు ఆ ‘హరి ప్రత్యక్షం అయి తీరుతాడు. చూడండి.
దరహాసామృత పూరితాస్యు నిజభక్త త్రాణ పారాయణున్‌ అరుణాం భోరుహ పత్రలోచనుని పీతావాసు త్రైలోక్యసుం
దరు, మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరే శ్వరు లక్ష్మీయుత వక్షు చిన్మయు దయా సాంద్రున్‌
చతుర్బాహునిన్‌! ఇటువంటి పద్యాలు- విద్యార్థులు తమ గురువ్ఞలు బోధించిన సంగీత సాహిత్య పరిజ్ఞానంతో పోటీపడి చదువ్ఞతున్నప్పుడు నిజంగా ఆ హరి కళ్ల ముందు ప్రత్యక్షంగా గాకుండా ఉంటాడా? కాకపోతే, వాడి పురాకృత పాపమే అని సంభావించాలి! పోతన గారు చిత్రవిచిత్రమైన విషయాలు చెప్పడంలో అందెవేసినచేయి-
ధనము వీధి బడిన దైవ వశంబున నుండు-పోవ్ఞ మూలనున్ననైన నడవి రక్ష లేని యబలుండు వర్థిల్లు
రక్షితుండు మందిరమున చచ్చు! ఇటువంటి చిన్న చిన్న పద్యాలు వింటున్నప్పుడు ‘హహ్వా వరెవా,యని యనకుండా ఉండలేము.ఇంకా విచిత్రం ఏమిటంటే ‘హిరణ్య కశిపుడి లాంటి పరమ మూర్ఖుడి నోటి మీదుగా తల్లి ‘దితికి ఎలాంటి వేదాంతాన్ని పోతన గారు చెప్పిస్తున్నాడో చూడండి- తన సోదరుడు హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి మట్టుబెట్టాడు. మరి ఏ తల్లికైనా ‘గర్భశోకం ఉంటుంది గదా ‘దితి కన్నీళ్లు పెట్టుకుంటుంటే తల్లిని ఓదారుస్తాడు ఆ దానవేంద్రుడు-
కుంతీస్తవం, భీస్మస్తవం అంబరీషోపాఖ్యానం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణం, వామన చరిత్ర మొదలైన ఘట్టాలు విధిగా విద్యార్థులు పఠిస్తే (అదే భట్టీయంవేస్తే) వారు ధన్యజీవ్ఞలౌతారు.

  • డాII అక్కిరాజు సుందరరామకృష్ణ

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/