పుణేలో ప్రారంభమైన ఐపిఎల్‌ వేడుకలు

This slideshow requires JavaScript.

పుణేలో ప్రారంభమైన ఐపిఎల్‌ వేడుకలు
అలరించిన షల్మాలీ, రితీష్‌ దేశ్‌ముఖ్‌

పుణే: ప్రతిష్టాత్మక ఐపిఎల్‌ -10 సీజన్‌ లో ఎనిమిది జట్టు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో ప్రారంభ వేడు కలను నిర్వహించనున్నట్లు ప్రక టించిన సంగతి తెలిసిందే.ఈ నేప థ్యంలో రైజింగ్‌ పుణే జట్టు సొంత గడ్డపై ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అభి మానులతో స్టేడియం కిక్కిరిసి పోయింది.సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రముఖ గాయని షల్మాలి కొల్గాడే తన ఆటపా టలతోఅభిమానులను అల రించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్‌ తార అమీ జాక్సన్‌ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ్టడ్యాన్స్‌పై మండిపడుతున్న నెటిజన్లు: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగిన ఐపిఎల్‌-10 ప్రారంభంలో బ్రిటీష్‌ మోడల్‌,నటి అమీ జాక్సన్‌ తన డ్యాన్స్‌తో కనువిందు చేసిన సంగతి తెలిసిందే.

ఐపిఎల్‌ ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా ఆమె నృత్య ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.గ్రాండ్‌ కాస్టూమ్స్‌ తో తళుక్కుమన్న అమీ తన వంతు ప్రదర్శనతో ప్రారంభోత్సవం రక్తికట్టించేందుకు ప్రయ త్నించింది. అయితే అమీ జాక్సన్‌ డ్యాన్స్‌ నెటిజన్లు ఏ మాత్రం పట్టించుకో లేదట.ఆమె డ్యాన్స్‌పై ట్విటర్‌లో విమర్శలు వస్తున్నాయి.అమీ జాక్సన్‌ డ్యాన్స్‌ చాలా దారుణంగా ఉంది.ఆమె డ్యాన్స్‌ను చూసి 28 మంది డ్యాన్స్‌ టీచర్లు తమ డ్యాన్స్‌ అకాడమీలను మూసుకున్నారని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా,అమీ కన్నా కోహ్లీ,సన్నీ లియోన్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారని మరికొందరు నెటిజన్లు చమత్కరించారు. ఈ రకంగా ట్విటర్‌లో, సోషల్‌ మీడియాలో అమీ జాక్సన్‌ మీద జోకులు, విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.ఐపిఎల్‌ -10 ప్రారంభోత్సవం స్థాయికి తగినట్లు ఆమె ప్రదర్శన లేదని వ్యాఖ్యాని స్తున్నారు.