పుట్టినరోజు కానుక

Dhavan
Dhavan

పుట్టినరోజు కానుక

టీమిండియా బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ తన 32వ పుట్టినరోజైన మంగళవారం నాడు కెరీర్‌లో 8వేల పరుగులు మార్కుకు చేరుకుని రికార్డు సృష్టించాడు. ధావన్‌ టెస్టు క్రికెట్‌లో 2000 పరుగులుసాధించిన 38వ భారత్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.. అయితే ఈ ఘనతను ధావన్‌ సిక్సర్‌తో సాధించాడు. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 8వేల పరుగుల క్లబ్‌లోనూ ధావన్‌ చేరాడు.. పుట్టినరోజున నాడు అర్ధశతకం చేయటం, 2వేల పరుగుల క్లబ్‌లో చేరటం ఎంతో సంతోషంగా ఉందని ధావన్‌ హర్షం వ్యక్తంచేశాడు. ఇదిలా ఉండగా, పూజార అవుటయ్యాక , వేగంగా పరుగులుచేయాలని ఆదేశాలు వచ్చాయని, కానీ తాను తనకు నచ్చిన విధంగానే ఆడానని, సరైన విధానంలో ఆడలనేదే తన లక్ష్యమని పేర్కొన్నాడు.. ఇందుకోసం తన మనస్సును ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంచుకుంటానని పేర్కొన్నాడు.