పుజారా, అశ్విన్‌పై గవాస్కర్‌ విమర్శలు

GAVASKAR111

పుజారా, అశ్విన్‌పై గవాస్కర్‌ విమర్శలు

న్యూఢిల్లీ: శ్రీలంకతో ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో భారత ఆటగాళ్లు పుజారా, అశ్విన్‌ తమ పేలవ కదలి కలతో మైదానంలో నిరాశపరిచారని మాజీ క్రికె టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఘాటు విమర్శలు చేసి నట్లు గురువారం వెలుగులోకి వచ్చింది. ఆటలో చివరి రోజైన బుధవారం శ్రీలంక వికెట్లు పడ గొట్టడంలో భారత్‌ బౌలరుల విఫలమయ్యారని ఫీల్డింగ్‌లో కోహ్లీ, జడేజా మినహా ఎవరూ చురు గ్గా లేరన్నారు. బుధవారం 87 ఓవర్లు బౌలింగ్‌ చేసిన టీమిండియా బౌలర్లు 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌కి కామెం టేటర్‌గా వ్యవహరించిన సునీల్‌ గవాస్కర్‌ మ్యాచ్‌ గమనాన్ని వివిరస్తూ పుజారా, అశ్విన్‌ల ఫీల్డింగ్‌ కదలికలపై పెదవి విరిచారు. మైదానం లో పుజారా కదలిక కారుకి హ్యాండ్‌ బ్రేక్‌ వేసి నడిపినట్లు ఉందని విమర్శించాడు. అశ్విన్‌ గురించి మాట్లాడుతూ వికెటుల్ల తీయాలని తాప త్రయపడుతున్నాడు. కానీ, సఫలం కాలేక పోతున్నాడని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు.