పుజారా అవుట్

సిడ్నీ: ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పుజారాకు త్రుటిలో డబుల్ సెంచరీ చేజారింది. తొలి రోజు నుంచి ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంటూ ద్విశతకానికి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్ లైయన్ పెవిలియన్కు పంపాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ (45), జడేజా(1) ఉన్నారు. 130 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 420 పరుగులు చేసింది.