పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్‌

టాలీవుడ్ డ్ర‌గ్స్ రాకెట్ జాబితాలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ పేరు తో పాటు 11 మంది సెల‌బ్రిటీలు ఉన్నారని, వారికి ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు కూడా పంపింద‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై కొంద‌రు తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని వివర‌ణ ఇచ్చుకోగా, పూరీ ఈ విష‌యాన్ని కాంట్ర‌వ‌ర్సీ చేసాడ‌నే వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ముగ్గురు టాప్ సెల‌బ్రిటీల త‌న‌యులు కూడా ఇందులో ఉన్నార‌ని వారి పేర్లు ఎందుకు బ‌య‌టకు రాలేద‌ని పూరి ప్రశ్నించిన‌ట్టు కొన్ని రూమర్స్ షికారు చేశాయి. దీనిపై పూరీ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స‌మాధానం ఇచ్చాడు. ఇంత వ‌ర‌కు ఏ వ్య‌వ‌హారం గురించి ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వ‌లేదు, నన్ను ఎవరూ సంప్రదించలేదు. తాను ప్రస్తుతం ‘పైసా వసూల్’ మూవీ షూటింగ్‌ బిజీగా ఉన్నానన్నారు. అంటే పూరీ ట్వీట్ తో సోష‌ల్ మీడియాలో పూరిపై వ‌స్తున్న వార్త‌ల‌న్ని అవాస్త‌వాలే అని తేలిపోయింది.