పీడీకి పరిటాల సునిత ఆదేశం!

Paritala Suneetha
Paritala Suneetha

అనంతపురం : శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మంత్రి సునీతను ఐసీడీఎస్‌ పీడీ చిన్మయాదేవి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వరుసగా ‘ఐసీడీఎస్‌ శాఖలో జరుగుతున్న ఘటనలను, ప్రతికల్లో వస్తున్న కథనాల గురించి ఆరాతీశారు. ఇది మంచిదికాదు. గట్టిగా ఉండండి. గాడిలో పెట్టండి. అని పీడీని మంత్రి పరిటాల సునీత ఆదేశించారు. ప్రతి ఒక్కరు నిబద్దత, చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పీడీని ఆదేశించారు.