పీఠంకోసం హోరాహోరీ

poll
Hillari, Donald

పీఠం కోసం హోరాహోరీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠం కోసం హోరాహోరీ జరుగుతోంది.. హిల్లరీ ఆధిక్యత 0.62 మాత్రమే నని తాజా సర్వే వెల్లడించింది. డెముక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ల మధ్యహోరాహోరీ ఉందని తాజా సర్వే వెల్లడించింది. మూడు బిగ్‌ డిబేట్లలో హిల్లరీ పైచేయి సాధించిందని, అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించటం ఆమెకు నల్లేరుమీద బండి నడేకనని అందరూ భావిస్తున్న తరుణంలో వెల్లడిఐన ఈసర్వే ప్రాదాన్యత సంతరించుకుంది. గతంలో ప్రీపోల్‌ను వెల్లడించిన ఐబిడి-టిఐపిపి తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ డోనాల్డ్‌ కంటే కేవలం 0.62 శాతం మాత్రమే ఆధిక్యత ఉందని పేర్కొంది.