పిసిసి పదవిపై ఆసక్తి లేదు

komatireddy venkatareddy
komatireddy venkatareddy

యాదాద్రి: పిసిసి పదవికి రాజీనామా చేస్తున్నారంటూ ఉత్తమ్‌పై వచ్చిన వార్తలపై ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిసిసి పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్తమ్‌ రాజీనామా అంశం ఆయనకే తెలియాలని అన్నారు. తనకు పిసిసి పదవిపై ఆశ లేదని ,పిసిసి కంటే ముఖ్యమైన ఎంపి పదవిని ప్రజలు తనకు కట్టబెట్టారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడతానని ఆయన అన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/