పిల్లల మాటలను వినండి

GIRL
GIRL

పిల్లల మాటలను వినండి

పిల్లలు ఏదేదో చెబుతుంటారు. వారికేమీ తెలియదు. కాబట్టి వాళ్లు చెప్పినదానికల్లా తలూపకండి. మీరు చెప్పిన ప్రకారం పిల్లలు నడుచుకునేలా చూసుకోండి. ఇలాంటి మాటలు పెద్దల నోటి నుంచి మనం తరచూ వింటుంటాం. అయితే ఈ తరం పిల్లల విషయంలో ఈ మాటలు తప్పంటారు. పిల్లల పెంపకం, వారి చదువ్ఞ విషయంలో తల్లిదండ్రులు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోనవసరం లేదంటారు. పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. ఇప్పటి పిల్లలు మనమనుకుంటున్నంత అమాయకులు కారు. వారి మానసిక పరిణతి వాళ్ల వయసుకంటే ఎక్కువగా ఉంటోంది. కాబట్టి పిల్లలు చెప్పడమేమిటి. మనం వినడమేమిటి అని కొట్టి పారేయకుండా, వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనల్ని కూడా వినాలి. వాటిని గౌరవించాలి అన్నది నిపుణుల భావన.