పిల్లల్లో వచ్చే మెదడు వాపు వ్యాధి

fever
fever

This slideshow requires JavaScript.

పిల్లల్లో వచ్చే మెదడు వాపు వ్యాధి

దీన్నే బ్రెయిన్‌ ఫీవర్‌, వైరల్‌ ఎన్‌సెఫలైటిస్‌, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ (జె.ఇ.) అని అంటారు. దీన్ని మొదటి 1500 సంవత్సరాల క్రితం ఇండోనేషియా, మలేషియాలలో గుర్తించారు. 1871లో జపాన్‌లో మొదటి కేసుగా మెదడు వాపుని గుర్తించారు. దీనివల్ల 20 జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌గా ప్రాచుర్యం పొందింది. ఆసియాలో ప్రతి సంవత్సరం 70,000 కేసులు వస్తుంటాయి. ఇది జెఇవి వైరస్‌ వల్ల వస్తుంది.

ఇది ప్లావీ వైరస్‌ తరగతికి చెందింది. 90శాతం మందిలో ఈ వైరస్‌ సోకినప్పటికి ఈ వ్యాధి రాదు. పదిశాతం మందిలోనే వస్తుంది. 250 మందికి ఇన్ఫెక్షన్‌ సోకితే వారిలో ఒకరిలో మాత్రమే వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. చాలామందిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించవ్ఞ. జె.ఇ.వైరస్‌ క్రిములు పందిలో వ్ఞన్నప్పటిక దీనికి రాదు. ఈ వైరస్‌ గుర్రాలు గేదెలు, ఆవ్ఞలు, పిల్లలు, కుక్కలు, బాతులు, గబ్బిలాలు, పక్షులలో కూడా వ్ఞంటుంది. కాని జె.ఇ.వైరస్‌ వ్ఞన్న పందిని కుట్టిన క్యూలెక్స్‌ దోమలోకి ఈ క్రిములు ప్రవేశిస్తాయి.

దోమల్లో 10 రోజుల్లో 10రేట్లు జె.ఇ.వైరస్‌ క్రిములు వృద్ధి చెందుతాయి. ఈ క్యూలెక్స్‌ దోమ మనుష్యుల్ని కుట్టినపుడు మనుష్యుల్లో వైరస్‌ క్రిములు చేరి మెదడువాపు వ్యాధిని కల్గిస్తుంది. దోమలు మెదడు వాపువ్ఞన్న వ్యక్తికి కుట్టి మరొక వ్యక్తిని కుట్టినంత మాత్రాన రాదు. అంటే పందులు మనుష్యులకు మధ్య వారధి క్యూలెక్స్‌ దోమలు. కొన్నిసార్లు ఎనాఫిలస్‌, మాన్సోనియా దోమల వల్ల కూడా వస్తుం ది. ఇది దోమలు, పందులు ఎక్కువగా వ్ఞన్న ప్రాంతాల్లో మురికివాడలు, జనసమర్ధ్యమున్న ప్రాంతాల్లో వర్షాకా లంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఆగష్టు నుంచి డిసెంబర్‌ వరకు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువగా వ్ఞంటుంది. ఈ వ్యాధి ఒక ప్రాంతంలో ఒకేసారి అనేక మందికి సోకుతుంది. దీన్నే ‘ఎపిడమిక్‌ డిసీజ్‌ అని అంటారు. సాధారణంగా 9-10 సంవత్సరాల కొకసారి ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతుంది. జె.ఇ వైరస్‌ రెండు దశలలో (పందులు, మనుష్యులు) సాగుతుంది. 1955లో ఇండియాలో మొదటి కేసు గుర్తించారు.

తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, గుంటూరులలో ఈ కేసులు అధికంగా నమోదు అయ్యాయి. అయితే ఇది ఇతర అంటువ్యాధుల్లా ఒకరి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించదు. ఈ వ్యాధి 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా ముఖ్యంగా 2-5 సంవత్సరాల వారిలో ఇది ప్రమాదకరంగా పరిగణిస్తుంది. వీరిలో మెదడు పైపొరలు, నాడీకణాలు వాస్తాయి. మెదడు దెబ్బ తింటుంది. అందుకే దీన్ని ‘బ్రెయిన్‌ ఫీవర్‌ అని అంటారు. వ్యాధి లక్షణాలు: పందుల్లో అభివృద్ధి చెందిన జెఇవి వైరస్‌ దోమల ద్వారా మనిషి రక్తంలోకి ప్రవేశించిన 5-16 రోజుల్లో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి.

ఇది 4 రకాలుగా కన్పిస్తుంది.
1. ఇన్ఫెక్షన్‌ తీవ్రత వల్ల వచ్చే లక్షణాలు
అధిక ఉష్ణోగ్రతతో జ్వరం, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. భరించలేని విధంగా బాడీ పెయిన్స్‌, గొంతునొప్పి, ఆహారం, నీళ్లు తీసుకోలేకపోవడం, జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లో అపస్మారకం వంటి లక్షణాలుంటాయి.
మెదడు దెబ్బతినడం వల్ల వచ్చే లక్షణాలు
శరీరంలోని అవయవాలు బలహీనతకు గురవడం, కనుగుడ్లు అటుఇటు తిప్పడం, కాళ్లు చేతులు ఎగరేయడం, అదరడం, బిగుసుకుపోవడం, మగత, గురక, ఎవర్ని గుర్తుపట్టలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఇంట్రాక్రేనియల్‌ టెన్షన్‌ పెరగడం వల్ల కలిగే లక్షణాలు స్పృహకోల్పోవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, విపరీతమైన తలనొప్పి, కంటిపాప వెలుతురుకు స్పందించకపోవడం, కనుగుడ్లు అసంకల్పితంగా అటుఇటు కదలడం, వాంతులు విపరీతంగా ఉండడం, నాడీ, శ్వాస ఒక క్రమపద్ధతిలో ఉండకపోవడం మెదడులోపల, బైట ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలుంటాయి. మెనింజియల్‌ ఇరిటేషన్‌ వల్ల కలిగే లక్షణాలు: మెడ ప్రాంతం గట్టిగా, బిగుసుకొని ఉంటుంది. కదలికలుండవ్ఞ. దీన్నే ‘నెక్‌ రిజిడిటీ అంటారు. కాలును నడుం దగ్గర వంచినపుడు మోకాలు ఒక పరిమితికి మించి ముడుచుకోకపోవడం. దీన్నే ‘కెర్నింగ్స్‌ సైన్‌ అంటారు.

కాంప్లికేషన్స్‌: బల్బార్‌పాల్సీ, రెస్పిరేటరీ పారాలసిస్‌, చెవుడు, డీహైడ్రేషన్‌, అంధ్యత్వం, అవయవాలు చచ్చుపడడం, పక్షవాతం, మెదడు నరాల లోపాలు, బిహేవియర ఛేంజ్స్‌, బుద్దిమాంద్యం, పెరిబ్రల్‌పాల్సీ వృషణాల వాపు, కేంద్ర నాడీమండలం, మెదడు దెబ్బతినడం, మరణం, కోమా వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.

జాగ్రత్తలు-చికిత్స:
ఒక్కసారిగా అనేకమంది పిల్లలు వ్యాధికి గురికావడం. పెద్దల్లో ఈ వ్యాధి కన్పించకపోవడం. జ్వరతీవ్రత ఎక్కువగా ఉండి సడన్‌గా సంధి, మగతలోకి జారుకోవడం, డీహైడ్రేషన్‌, ఒక ప్రాంతంలోని వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వ్ఞన్న పిల్లల్లో జ్వరాలు రావడం జరిగితే బ్రెయిన్‌ ఫీవర్‌గా గుర్తించాలి. చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. రక్తంలో ఐజిఎం ఆంటిబాడీస్‌ వ్ఞంటాయి. ఐవి ప్లూయిడ్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. వెన్నెముక నుంచి ద్రవం తీసి పరీక్షించాలి. దీన్నే లంబార్‌ పంక్చర్‌ అంటారు. దీనివల్ల ఇంట్రాకేనియల్‌ ప్రెషర్‌ తగ్గుతుంది. చి జెఇ వైరస్‌ను నాశనం చేసే మందులు లేవు .

ఆంటిబయాటిక్స్‌, పారసిటమాల్‌ మందులు పనిచేయవ్ఞ. ఆంటివైరల్‌ మందుల్ని డాక్టర్ల పర్యవేక్షణ లో మందుల్ని వాడాల్సి వ్ఞంటుంది. చి బ్రెయిన్‌ ఫీవర్‌కి వాక్సిన్స్‌ ఉన్నాయి. కాని మనం ఇప్పుడు ఇస్తున్న వాక్సిన్‌ టైప్‌ స్ఫెసిఫిక్‌ అంటే ఒక రకమైన వైరస్‌ నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుంది. దీనిలో అనేక రకాల సబ్‌టైప్స్‌ఉన్నాయి. వాటి నుంచి రక్షణ లేదు. ఈ వ్యాధి సోకకుండా పిల్లలకి రక్షణ కల్పించాలంటే 50 రకాల వాక్సిన్స్‌ ఇవ్వాలి. ఏ ప్రాంతంలో ఏ వైరస్‌ వస్తుందో గమనించి ఆ వైరస్‌ సోకకుండా వాక్సిన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇది సాధ్యం కాదు. వాక్సిన్‌ కాలపరిమితి కూడా ఆరేడు నెలల దాకా ఉంటుంది. దీనివల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముంది.

వ్యాధి రాకుండా..: ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పందుల్ని జనవాసాలకు దూరంగా ఉంచాలి. పందుల్ని పెంచేవారు జెఇవైరస్‌ ఉన్నవాటిని చంపివేయడం మంచిది. దోమలు కుట్టకుండా చూచుకోవాలి. డ్రైనేజ్‌ నీరు, అపరిశుభ్ర ప్రాంతాలు, నీటికుంటల్లా దోమలు, లార్వాలు పెరగకుండా మలాధియన్‌ స్ప్రే చేయాలి. చి హోమియోలో బ్రెయిన్‌ ఫీవర్‌కి వ్యాధినిరోధక మందులు అందుబాటులో ఉన్నాయి. బెలడోనా 200 ఉదయం పూట మాత్రమే 4-5 మాత్రలు చొప్పున వరుసగా మూడురోజులు చప్పరించాలి.

కాల్కేరియా కార్బ్‌ 200 ఉదయం పూట 4-5 మాత్రలు ఒక రోజు 10వ రోజు చప్పరించాలి. చి ట్యూబర్‌ క్యులినమ్‌ ఉదయం పూట 4-5 మాత్రలు ఒక రోజు 21వ రోజు చప్పరించాలి. వీటి కాలవ్యవధి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. చి పిల్లల్లో తీవ్రమైన జ్వరం రాగానే వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసుకొని వెళ్లి బ్రెయిన్‌ ఫీవర్‌ అవ్ఞనా కదా అని నిర్దారించుకొని సకాలంలో చికిత్స అందిం చగలిగితే నూటికి 60 మంది రికవరీ అవ్ఞతారు. 35 శాతం మందిలో కాంప్లి కషన్స్‌ ఏర్పడితే మిగిలిన 5శాతం మంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది.

– డా. కె. ఉమాదేవి, తిరుపతి