పిల్లల్లో మీజిల్స్‌-2

fever
fever

 

This slideshow requires JavaScript.

పిల్లల్లో మీజిల్స్‌-2

కాంప్లికేషన్స్‌: శ్వాసకోశ సంబంధమైనవి- ట్రాకియైటిస్‌, లారింజైటిస్‌ బ్రాంకైటిస్‌, న్యూమోనియా, సైనసైటిస్‌. కన్ను సంబంధమైనవి: మెల్ల, కార్నియల్‌ అల్సర్‌ ట్రకోమా కండ్లకలక కంటి నరాల న్యూరైటిస్‌ రెట్రోబల్బార్‌ న్యూరైటిస్‌ అంధత్వం చపు తగ్గడం, కన్నీటి గ్రంథులు రిపోవడం వంటి కంటి జబ్బులు వస్తాయి. న్యూరాలాజికల్‌ సంబంధమైనవి: ఫిట్స్‌, చెవ్ఞడు, ఎన్‌సెఫరైటిస్‌. చర్మ సంబంధమైనవి: ఇంపిటైగో, ఫరన్‌క్యులోసిస్‌, ఉడుకుగుల్లలు, శరీరం నుండి దుర్వాసన (మీజిల్స్‌ వాసన) చెవి సంబంధమైనవి: చెవినొప్పి, చెవిలో చీము కారడం, కర్ణభేరి చిల్లుపడి చెవ్ఞడు రావడం, చెవిలో రకరకాల శబ్దాలు రావడం. ఇవిగాక హెపటైటిస్‌, త్రాంటోసైటో పీనియా, రక్తంలో ప్లేట్‌లెట్‌ సంఖ్య తగ్గడం గుండె జబ్బులు వంటి 30శాతం కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. అంతేగాకుండా శరీరక, మానసిక పెరుగుదలలు మందగిస్తాయి.

గర్భధారణలో మీజిల్స్‌:
గర్భధారణలో మొదటి ట్రైమిష్టర్‌లో మీజిల్స్‌ వస్తే అబార్షన్‌ కావడం, పిండం చనిపోవడం వ్ఞంటుంది. గర్భిణీలు కనుక మీజిల్స్‌ వ్ఞన్న పిల్లల దగ్గర లేదా వారితో సన్నిహితంగా 15 నిమిషాలుంటే చాలు వారికి మీజిల్స్‌ వస్తుంది. ఈ వైరస్‌ గాలిలో రెండు గంటల వరకు ఆక్టివ్‌గా వ్ఞండి ఎఫెక్ట్‌ చేస్తుంది. వ్యాధి లక్షణాలు మైల్డ్‌గా వ్ఞంటే ఎటువంటి చికిత్స అవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ముందు కాన్ను సమయంలో, గర్భధారణలో మీజిల్స్‌ వచ్చినా, వ్యాధి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి అబార్షన్‌ చేయించుకోవాలి. రికి త్వరగా కాన్పుకావడం, బరువు తక్కువ పిల్లలు పుడతారు. ఆరునెలల వరకు తల్లి నుండి వచ్చే ఆంటిబాడీస్‌ వల్ల చంటి పిల్లల్లో ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి మీజిల్స్‌ రాదు.

ప్రెగ్నెన్సీలో సీరియస్‌ కాంప్లికేషన్‌ వస్తే మటుకు పిల్లల్లో బ్రెయిన్‌ డామేజ్‌, చెవ్ఞడు, న్యూరాలాజికల్‌ సమస్యలేర్పడతాయి. లేకపోతే తల్లికి వస్తే పిల్లలకు ఎఫెక్ట్‌ కాదు. అరుదుగా మూడవ ట్రైమిష్టర్‌లో కాన్పు సమయంలో తల్లికి మీజిల్స్‌ వస్తే చంటి పిల్లలకు వస్తుంది. దీన్నే ‘జెస్టేషనల్‌ మీజిల్స్‌ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చంటి పిల్లల్లో సమస్యలు ఏర్పడతాయి. వెయ్యిమందిలో ఒకరు చనిపోవడం లేదా మెనింగో ఎన్‌సెఫలైటిస్‌, మెదడువాపు, ఫిట్స్‌ వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. గర్భిణీలకు వాక్సిన్‌ వేయరాదు. ఎందుకంటే దాంట్లో బతుకున్న వైరస్‌ ఉంటుంది. చాలా ప్రమాదకరం. తల్లికి చిన్నప్పుడే ఎంఎంఆర్‌ వాక్సిన్‌ వేసుకుని వ్ఞంటే మీజిల్స్‌ రాదు. తల్లికి మీజిల్స్‌ వచ్చిన పిల్లల్లో పుట్టుకతో లోపాలు ఏర్పడవు

జాగ్రత్తలు – చికిత్స:

ఇన్ఫెక్షన్‌ ఇతరులకు సోకకుండా రోగిని ప్రశాంత వాతావరణంలో ఇతరులకు దూరంగా ఉంచాలి. వరి వస్తువ్ఞలు వేరే ఉంచాలి. రదుమ్ము ధూళి లేకుండా గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి.

ఆహారం తేలికగా జీర్ణమయ్యే విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ద్రవాహారం, బార్లీ గంజి, పాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, గ్లూకోజ్‌, విటమిన్‌ ఎ సంప్లిమెంట్స్‌, జింక్‌ వంటి మినరల్స్‌, విటమిన్స్‌ ఇవ్వాలి. ర రోగి బైట తిరగకుండా విశ్రాంతి తీసుకోవాలి.

ఏదైనా తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. నోటిలో పొక్కులుంటాయి. ఉదయం, రాత్రి రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలి. ర గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగాలి. ర వేపాకులు లేదా ఆలివ్‌ ఆకులు పేస్ట్‌ చేసి శరీరానికంతా పట్టించి అరగంట రిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. జ్వరం ఉంటే వేపపసుపు నీళ్లతో అద్దిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవడం మంచిది. వారి పడక, దుస్తులు పరిశుభ్రంగా ఉంచాలి.

పండ్లు ఆరెంజ్‌, ద్రాక్ష, చీనీ, ఉసిరి, తేనె, నిమ్మరసం ఇవ్వవచ్చు. ర పిల్లల్ని తగ్గేంత వరకు స్కూల్‌కి పంపరాదు. కంటికి సన్‌గ్లాసెస్‌ వాడాలి. కండ్లు పుసులు కట్టడం, వెలుతుర్ని చూడలేకపోవడం వ్ఞంటే రూమ్‌ డిమ్‌గా వ్ఞంచడం మంచిది. ర వ్యాధి లక్షణాలు తగ్గడానికి 7-10 రోజులు పడుతుంది. అంతవరకు విశ్రాంతి చాలా అవసరం. పిల్లల దగ్గర స్మోక్‌ చేయరాదు. వ్యాధ తీవ్రతని తగ్గించాలి. అంతేకాకుండా కాంప్లికేషన్స్‌ రాకుండా ఆరికట్టడం ముఖ్యం.

ఎలర్జీ, ఆటిజిమ్‌, తీవ్ర అనారోగ్యం, కేన్సర్‌ ఉంటే గర్భిణీలకు వాక్సిన ఇవ్వరాదు. ర పొంగు వచ్చిన తర్వాత తగ్గడానికి సరైన మందులు లేవ్ఞ. అల్లోపతిలో జ్వరం తగ్గడానికి పారసిటమాల్‌ టాబ్లెట్స్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి ఆంటిబయాటిక్స్‌ సిరప్‌లు వాడుతారు. ర చాలామంది మీజిల్స్‌ వచ్చినప్పుడు అమ్మవారికి కోపం వస్తుందని మందులు వాడక వేపాకుతో పథ్యం పెడతారు. అది చాలా తప్పు. కాబట్టి పొంగు వచ్చినపుడు తప్పక మందులు వాడాలి. లేకపోతే దానివల్ల ఏర్పడే దుష్ఫలితాల వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాద ముంది.

పొంగు రాకుండా చిన్నప్పుడే టీకాలు ఇప్పించడం చాలా మంచిది. అన్ని క్లినిక్స్‌లో హాస్పిటల్స్‌లో పొంగు జ్వరం రాకుండా పసిపిల్లలకు తొమ్మిదవ మాసంలోనే మీజిల్స్‌ వాక్సిన్‌ వేస్తారు. దీనివల్ల జీవితాంతం పొంగురాదు. ఈ వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెంపొందించడానికి బిడ్డకు 1 1/2 సంవత్సరంలో మీజిల్స్‌ వాక్సిన్‌ బూప్టర్‌ డోన్‌ ఇప్పించడం చాలా ముఖ్యం. అలా వేయించనివారు కనీసం వ్యాధి ప్రబలినపుడు వ్యాధి విరోధక టీకాలు ఇప్పించడం చాలామంచిది.

హోమియోచికిత్స:
మీజిల్స్‌ రాకుండా ముందు జాగ్రత్తగా హోమియోలో మంచి మందులున్నాయి.
1. మార్చిలినం: 1 ఎం పొటెన్సీలో ఉదయం సాయంత్రం 5.6 మాత్రలు చొప్పున ఒక రోజు వేసుకోవాలి. అంతేకాకుండా కీలీమూర్‌ 12ఎక్స్‌ మాత్రలు మూడు రెండు పూటలా వారం రోజులు వాడితే దీన్ని సులభంగా అరికట్టవచ్చు. ఇది తరుణ వ్యాధి అయినా రోగి రోగ లక్షణాల్ని బట్టి ఈ కింది హోమియో మందుల్ని వైద్యపర్యవేక్షణలో వాడితే వ్యాధి తీవ్రత నుండి, వ్యాధి దుష్ఫలితాల నుండి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జలుబు, జ్వరం ఆకస్మాత్తుగా వస్తుంది. దప్పిక ఎక్కువ, ఆందోళన, భయం, అస్థిమితం, ముఖం ఎర్రగా కందిపోయి వ్ఞన్న వారికి ఎకోనైట్‌ 30 పొటెన్సీలో 4 గంటలకు ఒక డోసు చొప్పున ఇస్తే రెండు రోజుల్లో దద్దు బైటికి వచ్చి జ్వరం తగ్గిపోతుంది. రోగికి మిగిలిన బాధలుండవు .

వేసవి కాలంలో నిదానంగా ప్రబలే మీజిల్స్‌కు జెల్సీమియం 30 పొటెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి జలుబు, ఒళ్లునొప్పులు, తలభారం, జ్వరం వ్ఞంటుంది. జ్వరం తలనొప్పి ఎక్కువగా వ్ఞంటే బెల్లడోనా బ్రయోనియా, ఫెర్రంషాస్‌ ఇవ్వవచ్చు. కండ్ల నుండి ముక్కు నుండి నీళ్లు కారుతూ జలుబు, తుమ్ములు దగ్గు ఎక్కువగా వ్ఞంటే యుప్రేమియా, కాలీమూరె, నేట్రం మూర్‌ మందుల్ని లక్షణాల బట్టి ఇవ్వవచ్చు. రాష్‌ వచ్చినపుడు ఇపెకాకి, పల్సటిల్లా కాలీసల్ఫ్‌ ఆంటింటార్ట్‌, సల్ఫర్‌ వాడవచ్చు. దద్దు నల్లబడి రక్తస్రావంతో ఉంటే ఆర్స్‌ఆల్బ్‌, లేకసిస్‌, టారెంట్సూలా మందుల్ని ఇవ్వవచ్చు.

ఇవేగాక కేంఫర్‌, కాలీబైక్రోమికం, డ్రోసిరా మందుల్ని లక్షణాల్ని బట్టి వాడుకున్నచో మీజిల్స్‌ను సమర్ధవంతంగా హోమియో మందుల ద్వారా 1-3 వారాల్లో ఆరికట్టవచ్చు. వ్యాధి నిర్దారణ: నోటిలో క్లాపిక్సో స్పాట్స్‌, జలుబు, దగ్గు, కండ్ల కలకతో నిర్దారించవచ్చు. టెంపరేచర్‌ కర్వ్‌: పొంగులో మొదటి రోజు జ్వరం ఎక్కువగా వ్ఞండి రెండవ రోజు కి తగ్గుతుంది. మళ్లీరాష్‌ వచ్చేముందు జ్వరం ఎక్కువగా వ్ఞండి, రాష్‌ తగ్గేటప్పు డు సడన్‌గా తగ్గి 7వ రోజుకి నార్మల్‌కి రావడం ఈ జ్వరం ప్రత్యేకత. పొంగు జ్వరం రాకుండా ప్రివెన్షన్‌గా పిల్లలకు వాక్సిన్‌ వేయించడం మంచిది.

– డా. కె. ఉమాదేవి, తిరుపతి