పిల్లల్లో పౌష్టికాహార లోపం

ప్రజావాక్కు
                     పిల్లల్లో పౌష్టికాహార లోపం

mal nutrition
mal nutrition

 

పిల్లల్లో పౌష్టికాహార లోపం
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థ తాజా నివేదిక ప్రకారం దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టి కాహార లోపం ఎక్కువగా ఉందన్న గణాంకాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వపథకాల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వర్గాల కోసం ఉపప్రణాళిక నిధుల కింద కేటాయిస్తున్న నిధులలో 30 శాతం కూడా ఖర్చు కావడం లేదన్న విషయం ఆందోళనకర విషయం. జాతీయబాలల నివేదిక 2018 ప్రకారం తెలుగు రాష్ట్రాలలోనుచిన్నారుల ఆరోగ్యస్థితిగతులు అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కమిషన్లు ఏర్పాటు కాలేదు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేసే ప్రభు త్వాలు ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఆహారపదార్థాలను తప్పనిసరిగా అందచేయాలి. కోట్లాది నిరపేద కుటుంబాలకు విస్తృత ఉపాధి అవకాశాలను చేరువ చేయాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రజలే న్యాయనిర్ణేతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరునెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవడం అంటే ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడం కాదా? ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా?ఈ ముందస్తు ఎన్నికల వల్ల ఎవరికి లాభం? ఇది మేడిపండు ప్రజాస్వామ్యం వాగ్దానాల అక్షయపాత్రల్తో ప్రజల్ని ఊరిస్తున్నా రు. ప్రజలకు డబ్బులిచ్చి, తిండిపెట్టి సభలకు వారిని తరలిం చడం కూడా దౌర్భాగ్యం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల ప్రచారం చేయడమెందుకు? ఏ పార్టీ ఏమి చేయగల దో అంటే తమ మేనిఫెస్టోలను టి.వి, పత్రికల ద్వారా వివరిస్తే సరిపోతుంది. అప్పుడు ప్రజలే ఏ పార్టీని గెలిపించాలో నిర్ణయించుకుంటారు.
-ఎస్‌.భూదేవి,ఇందూర్‌, నిజామాబాద్‌్‌

చట్టసవరణ ఏది?
నిత్యం వాడే ఆహార పదార్థాలు కల్తీమయం అవ్ఞతున్నాయి. పాలు, మందులను కూడా కల్తీ చేస్తూ అక్రమార్కులు ప్రజా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ ఆహారాన్ని విక్ర యించినా, తయారు చేసిన నేరమే. ప్రస్తుతం ఉన్న చట్టాలకు తోడు ఇటీవల ఆహార భద్రత ప్రమాణాల సంస్థ కీలకమైన సిఫారసులతో చట్టసవరణకు ప్రతిపాదించింది. కల్తీ తీవ్రతను బట్టి రూ.10 లక్షల వరకు జరిమానా విధించాలని, కీలక ప్రతిపాదనలు చట్టసవరణలో చేర్చాలని ఆసంస్థ ప్రకటించింది.
-ఉలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు,ప్రకాశంజిల్లా

రక్తనిధుల ఏర్పాటు అవసరం
నల్గొండ జిల్లాలో అత్యవసర సమయాలలో రక్తం లభించక ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అవసరమైన రక్తనిల్వలు ఉండేలా చేయడం, అద నపు రక్తంబ్యాంక్‌ల ఏర్పాటు,రక్తదాతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచడం, గ్రామస్థాయిలో రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తదానంపై అవగాహన సదస్సుల నిర్వహణ ఇత్యాది అంశా లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ప్రస్ఫుటమవ్ఞతోంది. రక్తదానం వలన ఎలాంటి దుష్పరిణామాలు కలుగవన్న నమ్మకాన్ని ప్రజలలో కలుగచేయాలి. వివిధ సేవా సంస్థల సహకారం తీసుకొని జిల్లాల వారీగా తగినన్ని రక్తనిల్వలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

మద్యం దుకాణాలను నిషేధించాలి
హైవేకు ఇరువైపులా 100 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించడంతోపాటు ఎక్కడా మద్యం అమ్మకూడ దన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు అవ్ఞతున్నాయి. శ్రీకాకుళం-విశాఖ వెంబడి ఎన్‌హెచ-65 జాతీయ రహదారి వెంబడివ్ఞన్న వైన్‌షాపులలో 24గంటలు నిరాటంకంగా మద్యం లభ్యం అవ్ఞతోంది. రోడ్డుపక్కన దబాలు, దుకాణాలలో విచ్చల విడిగా మద్యం అమ్ముతునానరు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులయ్యేవారిపై పోలీసులు, రవాణా శాఖ ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని షాపులను తూతూ మంత్రం చందాన సరిగ్గా వందల మీటర్ల అవతలకు మార్చేసి యధాలాపంగా వ్యాపా రాలను కొనసాగిస్తున్నారు. -కె.శివసాయి, శ్రీకాకుళం

పెరుగుతున్న యాచక వృత్తి
రెండు తెలుగు రాష్ట్రాలలో యాచన నానాటికీ ఎక్కువ్ఞతోంది. కూడళ్లు, సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వద్ద ప్రజలను అటకాయించి మరో భిక్షాటన చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వాహనాలకు అడ్డంపడి భిక్షం వేస్తే కాని అడ్డు తొలగడం లేదు. వికలాంగులు, వృద్ధులే కాకుండా శారీరక ధారుడ్యం గలవారు, వయస్సులో ఉన్న మహిళలు, పిల్లలు కూడా యాచక వృత్తికి పాల్పడుతున్నారు. ఇది వరకు ఆహారపదార్థాలు దానం చేస్తే ఇప్పుడు విధిగా నగదు ఇవ్వవల్సి వస్తోంది. చిన్న పిల్లలను ఎత్తుకుపోయి వారిచేత బలవంతంగా భిక్షాటన చేయించే గ్యాంగులు ఎక్కువయ్యాయన్న ఆందోళన కలిగిస్తున్నాయి.
-ఎన్‌.రమేశ్‌బాబు, నల్గొండ