పిల్లల్లో జ్వరాల లక్షణాలు

This slideshow requires JavaScript.

పిల్లల్లో జ్వరాల లక్షణాలు

పిల్లలకి సడన్‌గా, అర్ధరాత్రిళ్లు జ్వరం రావడం బాధపడడం, అస్థిమితంగా దొర్లడం చేస్తుంటారు. చంటిపిల్లల్లో జ్వరం తప్ప ఏ లక్షణాలు కన్పించదు. 5-15శాతం మంది పిల్లల్లో మాత్రమే జ్వరం ప్రమాదకంగా పరిణమిస్తుంది. సెప్సిస్‌, బాక్టీరీమియా, న్యూమోనియా, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌, మెనింబైటిస్‌ వంటి బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌లో జ్వరం తీవ్రంగా వ్ఞంటుంది. జ్వరంతో పాటు రాష్‌, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, మూత్రం, మలవిసర్జన లేకపోవడం, పొట్ట ఉబ్బరం, నొప్పి, జలుబు, దగ్గు, ఆయసం వంటి ఇతర లక్షణాలుంటాయి. దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చంటిపిల్లలకి ఎండాకాలంలో వేడికి, మందమైన సిల్క్‌ బట్టలు వేసినప్పుడు, నీళ్లు తాగించకపోవడం వల్ల కూడా శరీరం వేడిగా వ్ఞంటుంది. దీన్నే ‘డీహైడ్రేషన్‌ ఫీవర్‌ అంటారు. పిల్లలు యాక్టివ్‌గా ఉండి ఆహారం కొంచెం సరిగా తీసుకోకపోయినా పరవాలేదు.

ఇతర వ్యాధి లక్షణాలు లేకపోతే కంగారు పడనవసరం లేదు. జాగ్రత్తలు: చి వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌, నోరు పొడిగా ఉండడం, డయాపర్స్‌ డ్రై (పొడి)గా వ్ఞన్న, ఏడుస్తున్నా కంట్లో నుంచి నీళ్లు రాకపోవడం, పుణికె భాగం గుంతలాగా వ్ఞండడం, పల్సేషన్స్‌ ఎక్కువగా వ్ఞండడం, ఫిట్స్‌ రావడం, జ్వరంతో రాష్‌ (పొక్కులు) రావడం, ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉండడం, రక్తం లేదా ఇమ్యూన్‌ వ్యాధులున్నప్పుడు రిక్‌ వ్ఞన్న కేసులో వెంటనే పిల్లల్ని డాక్టరుకు చూపించాలి. చి జ్వరం రాగానే మొట్టమొదట చేయాల్సిన పని విశ్రాంతి నీళ్లు బాగా తాగించాలి. కాని ఐస్‌వాటర్‌, ఐస్‌వేసిన జ్యూస్‌లు, కూల్‌డ్రింక్‌లు తాగించరాదు. చి ఎండాకాలంలో పిల్లలకి పల్చని వదులైన దుస్తులు లేదా చిన్న డ్రాయర్‌ వేయడం మంచిది. చి ఫ్యాన్‌ కింద ఉంచాలి. వేడి తగ్గడానికి తడిగుడ్డ నుదటిపై వేయాలి. చి గోరువెచ్చని నీళ్లతో వళ్లు తుడవడం, స్పాంజింగ్‌ చేయాలి. చి జ్వరం ఎక్కువగా వ్ఞంటే చల్లనీళ్లతో స్నానం చేస్తే తగ్గిపోతుందని భావిస్తారు. చల్లనీళ్లు, ఐస్‌వాటర్‌తో, ఆల్కహాల్‌తో శరీరాన్ని తుడవకూడదు.

చి జ్వరం తగ్గిన 24-36 గంటల తర్వాతనే పిల్లల్ని స్కూల్‌కి పంపాలి. చి 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఆస్ప్రో, ఆస్పిరిన్‌ మాత్రల్ని సిరప్‌ల్ని ఇవ్వరాదు. ఎందుకంటే రేయాక్స్‌ సిండ్రోమ్‌, బ్రెయిన్‌ డిసీజెస్‌ వచ్చే అవకాశముంది. చి జ్వరాలు ఎక్కువగా రాత్రిళ్లు వచ్చి తెల్లవారి తగ్గిపోతాయి. మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కువగా జ్వరం వ్ఞంటుంది. చి తీవ్రమైన జ్వరం వ్ఞన్నప్పుడు పిల్లల్లో ఫిట్స్‌ వస్తాయి. వీటినే ఫెబ్రల్‌ సీజర్స్‌ అంటారు. పిల్లలు కలరించడం, మగత, స్పృహ లేకపోవడం, కాళ్లు, చేతులు కొట్టుకోవడం, నోటి నుంచి చొంగ రావడం వ్ఞంటుంది. నూటికి ముగ్గురు పిల్లల్లో జ్వరంతోపాటు ఫిట్స్‌ వస్తాయి. చి పిల్లల్లో ఫిట్స్‌ రాగానే గాలి వెలుతురున్న ప్రదేశంలో పిల్లల్ని పడుకోబెట్టాలి. పదునైన, ప్రమాదకరమైన వస్తువ్ఞల్ని తీసివేయాలి. దుస్తులు వదులు చేయాలి. నోట్లో ఏమీ పెట్టకూడదు. ఏ ప్రమాదం జరగకుండా చూడాలిదివి కొంతసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. జ్వరంతో ఫిట్స్‌ కనిపించడం అంత ప్రమాదం కాదు. చి జ్వరంతో వచ్చే ఫిట్స్‌ మెదడులో ఎటువంటి డిసీజ్‌ లేకుండానే వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల నర్వ్స్‌లో ఎలక్ట్రిక్‌ రీచార్జ్‌ వల్ల మాత్రమే ఫిట్స్‌ వస్తాయి. కాబట్టి జ్వరం ఎక్కువ కాకుండా తడిగుడ్డతో తుడుస్తుండాలి. 6 నెలల నుంచి ఆరేళ్లపిల్లల్లో ఫిట్స్‌ రావడం సహజం. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి చికిత్స అవసరం లేదు. చి జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని గమనించి మందులు వాడాల్సి వ్ఞంటుంది. చి చాలావరకు జ్వరాలు 2-3 రోజులుండి తగ్గిపోతాయి.

ఎక్కువ రోజులుండి పిల్లలు డల్‌గా వ్ఞండి ఆహారం తీసుకోకపోతే వ్యాధి నిర్ధారణ కోసం రక్త, మల, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్‌లు డాక్టర్ల పర్యవేక్షణలో చేయాల్సి వ్ఞంటుంది. చి జ్వరమన్న పిల్లలు ఆడుకుంటూ వ్ఞంటే ఏమీ కంగారు పడనక్క రలేదు. వారిని బైటికి పోనికుండా ఫ్రీగా ఇంట్లోనే తిరగనిస్తే చాలు. చి ఆహారాన్ని బలవంతంగా పెట్టకుండా, వారు తినగలిగినంత వరకు ఆహారాన్ని ఇవ్వాలి. ఎక్కువగా ద్రవపదార్థాల్ని, పాలు, పండ్ల రసాలు, గంజి, ఇడ్లీ, బ్రెడ్‌, అన్నం, బబిస్కట్స్‌ వంటి తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఇవ్వడం మంచిది. చి పిల్లలు భయపడిన, దడుసుకున్న, దెబ్బలు తగిలిన, పెద్దలు లేదా స్కూల్‌లో టీచర్లు దండించిన జ్వరం వస్తుంది. కాబట్టి కారణాన్ని తెలుసుకొని ధైర్యం కల్గించి మందులు వేస్తే ఆటోమేటిక్‌గా మరుసటి రోజుకంతా తగ్గిపోతుంది. దీన్నే సైకాలజికల్‌ ఫీవర్‌ అంటారు. చి పిల్లల్లో వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక, వర్షాకాలంలో తేమకు, ఎండాకాలంలో వేడికి, చలికాలంలో చలికి ఆయా సీజన్స్‌లో తరచు జ్వరం వస్తుంటుంది. వీటినే సీజనల్‌ ఫీవర్స్‌ అంటారు. చి ఇంట్లో కాని, స్కూల్‌లో కాని జ్వరం వ్ఞన్న వారితో సన్నిహితంగా వ్ఞన్న, అంటువ్యాధులు ప్రబలినపుడు పిల్లలకు సులభంగా ‘వైరల్‌ ఫీవర్స్‌ వస్తుంటాయి. జ్వరం వ్ఞన్నప్పుడు వ్యాధిగ్రస్తుల వస్తువ్ఞలు సపరేట్‌గా ఉంచి వారిని సపరేట్‌గా ఉంచి చికిత్స చేస్తే జ్వరాలు ఇతరులకి సోకకుండా వ్ఞంటుంది. చి పిల్లల్లో 3-4 రోజులమించి జ్వరం వ్ఞంటే అశ్రద్ధ చేయరాదు. ఏ వ్యాధి వల్ల అయితే జ్వరం వచ్చిందో ఆ వ్యాధి కానీ, అంటువ్యాధి కానీ అధికంగా ప్రబలే అవకాశం వ్ఞంది. ఒక్కోసారి దీనివల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. =

Dr. K.UmaDevi, Tirupati