పిల్లల్లో కీళ్లనొప్పులకు కారణాలు

                               పిల్లల్లో కీళ్లనొప్పులకు కారణాలు

PAIN
PAIN

సాధారణంగా పదహారు సంవత్సరాల వయస్సు న్న పిల్లల్లో కీళ్ల నొప్పులు ఉండవు. ఒకవేళ ఉంటే సాధారణమైన నొప్పులుగా భావించకూడదు. సరైన సమయంలో చికిత్సలను తీసుకోవాలి. జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (జెఆర్‌ ఎ)గా వ్యవహరించే ఈ స్థితికి గురైనవారిలో నిరోధక శక్తి స్వయంప్రేరితంగా మారి మోకాళ్లు, మోచేతు లు, మణికట్టు, చీలమండలు, వేళ్ల కణుపులు మొదలైన ప్రాంతాల్లోని జాయింట్లలో వాపును, నొప్పిని కలుగజే స్తుంది. దీనిని వైద్యపరిభాషలో ఇమ్యూన్‌ మీడియేటెడ్‌ జాయింట్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు. మామూలు వ్యక్తుల్లో తెల్లరక్తకణాలు వైరస్‌, బాక్టీరియా వంటి శరీరేతర హానికరాం శాలను గుర్తించి తగిన విధంగా ప్రతిస్పందిస్తుం టాయి. జువనైల్‌ రుమటాయిడ్‌ అర్థరైటిస్‌ వ్యాధి సోకిన వారిలో ఈ విచక్షణ లోపిస్తుంది. అంటే తెల్ల రక్తకణాలు ఆరోగ్యకరమైన శారీరక కణజాలా లను శరీరేతర హాని కరాంశాలుగా పొరపాటుపడి దాడి చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి 6 నుంచి 16 సంవత్సరాల వయస్సుండే పిల్లల్లో కనిపి స్తుంది. ఎక్కువ జాయింట్లు వ్యాధి ప్రభా వానికి గురైతే లక్షణాలు దీర్ఘకాలంపాటు కొనసాగు తాయి. జాయింటు అనేది రెండు లేదా అంతక ంటే ఎక్కువ ఎముకలు కలిసే ప్రదేశం. ఎముకలు ఒక దాని మీద మరొకటి కదిలేప్పుడు రాపిడి పుట్టకుండా ఉండటం కోసం మృదులాస్తితో తయారైన పొర ఎముకల చివరిభాగాలను కప్పి ఉంచుతుంది.

జాయి§ంటును సరైన ప్రదేశంలో ఉంచడం కోసం దాని చుట్టూ కేప్సూల్‌ అనే గట్టి పొర చుట్టి ఉంటుంది. ఈ పొర లోపల జాయిం టు తేలికగా కదలడం కోసం సైనోవియల్‌ ద్రవం ఉంటుంది. జాయి ంటును పటిష్టంగా ఉంచడం కోసం ఎముకలను కలుపుతూ కండ రాలు, లిగ మెంట్లుంటాయి. అలాగే జాయింటుకు పోషక తత్వాలు అందించడం కోసం రక్తనాళాలుకూడా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ సజావుగా పని చేస్తున్నంతకాలం ఏ సమస్యా ఉండదు. జువ నైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో జాయింటును ఆవరించి ఉండే సైనో§వియల్‌ పొర వ్యాధి గ్రస్తమై వాచిపోతుంది. తెల్ల రక్తకణాలు ఈ పొర లోనికి చొచ్చుకు వెళ్లి విధ్వంసక నైజం ఉన్న రసా యన పదార్థాలను విడుదల చేస్తాయి. ఫలి తంగా ఎముకల చివర ఉండే మృదులాస్తి ఒరిపి డికి లోనై గగ్గురుగా తయారవుతుంది. నునుపు దనం కోల్పోవడం వలన ఎముకల కదలిక దుస్సా ధ్యం గా తయారవుతుంది. ఈ వ్యాధి ప్రభావం వల్ల కండరాలు, లిగమెంట్లు పట్టును కోల్పోతాయి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే అంశంపై ఇంత వరకు స్పష్టమైన కారణమంటూ ఏదీ నిర్ధారణ కాలేదు. కాకపోతే జన్యుపరమైన అంశాలను ఆధారం చేసుకుని ఆటో ఇమ్యూనిటీని ఒక ముఖ్య మైన కారణంగా భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దవారిలోలాగ ఈ వ్యాధికి లోనైన పిల్లల్లో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్స్‌ వంటివి రక్త పరీక్షల్లో బైటపడవు. అయినప్పటికీ లక్షణాలను ఆధారం చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈవ్యాధికి లోనైన పిల్లలకు తరచుగా కీళ్ల నొప్పులు బాధి స్తుంటాయి. కీళ్లలో పట్టేసినట్లు ఉంటుంది.

జాయింటు ఎర్రగా కమలటం, వేడిగా ఉండటం వంటివి ఈ వ్యాధిలో కనిపించే లక్షణాలు. వ్యాధి కి లోనైన జాయింటు తాలూకు ఎముక పెరుగు దలలో మార్పులు సంభవించి కాళ్లు, చేతుల పొడుగు విషయంలో అసమానతలు చోటుచేసు కుంటాయి. నొప్పిగా ఉండే జాయింటును కదల్చక పోవడంవల్ల దానికి ఊతమిచ్చే కండరం బలహీనపడి బిగు సుకు పోతుంది. ఒక కన్ను ఎర్రబడుతుంది. కొంతమంది పిల్లల్లో కేవలం కీళ్ల నొప్పులే కాక రక్తహీనత, ఎత్తు పెరగకపోవడం, ఆకలి మందగించడం, లో-జ్వరం, చర్మంపైన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా మూడు భేదాలుం టాయి. పాలి ఆర్టిక్యులర్‌ ఆర్థరైటిస్‌ అనేది మొదటి రకం. ఇది మగపిల్లలకంటే ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయిదు జాయింట్లలో కాని, అంతకంటే ఎక్కువ జాయింట్లలో కాని నొప్పి, వాపు ఉంటాయి. చేతివేళ్ల కణుపులతో పాటు బరువును మోసే జాయింట్లలో మోకాళ్లు, మడమలు, పాదాలు, మెడ వంటివి వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. వీటితో పాటు తక్కువ స్థాయిలో జ్వరం ఉంటుంది.

పాలి ఆర్టిక్యులర్‌ జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది రెండవ రకం. దీనిలో నాలుగు కంటే తక్కువ జాయింట్లు వ్యాధిగ్రస్తమవుతాయి. జాయింట్లలో నొప్పి, బిగు సుకుపోవడం, వాపు వంటి లక్షణాలు ఉంటాయి. మోకాళ్లు, మణికట్టు ఎక్కువగా వ్యాధి బారిన పడ తాయి. కంటిలోని నల్లని భాగం వ్యాధి ప్రభావా నికిలోనై తద నుగుణమైన లక్షణాలను ప్రదర్శి స్తుంది. సిస్టమిక్‌ జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మూడవ రకం. దీనిలో జాయింట్లు మాత్రమే కాకుండా శరీరం మొత్తం వ్యాధి ప్రభా వ్శానికి లోనవుతుంది. ప్రతిరోజూ సాయంకాల మయ్యే సరికి జ్వరం తీవ్ర స్థాయిని చేరుకుం టుంది. రక్తహీనతకు గుర్తుగా చర్మం పాలిపోయి కనిపిస్తుంది. చర్మం పైన ఎర్రని తడపర లేదా దద్దురు ఉన్నట్లుండి కనిపిస్తూ తిరిగి హఠాత్తుగా తగ్గిపోతుంటుంది. ప్లీహం వాస్తుంది. లసిక గ్రం థుల్లో వాపు కనిపిస్తుంది. వీటిని అనుసరించి జాయింట్లలో వాపు, వేడి, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.